iDreamPost
android-app
ios-app

సుహాస్‌కి సుకుమార్ సాయం! ఇండస్ట్రీలో ఇది కొత్త ట్రెండ్!

  • Published Apr 26, 2024 | 6:45 PM Updated Updated Apr 26, 2024 | 6:45 PM

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ తాజాగా ప్రసన్నవదనం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే సుహాస్ నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ అండగా నిలుస్తున్నారట. అదేలా అంటే..

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ తాజాగా ప్రసన్నవదనం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే సుహాస్ నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ అండగా నిలుస్తున్నారట. అదేలా అంటే..

  • Published Apr 26, 2024 | 6:45 PMUpdated Apr 26, 2024 | 6:45 PM
సుహాస్‌కి సుకుమార్ సాయం! ఇండస్ట్రీలో ఇది  కొత్త ట్రెండ్!

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. ప్రస్తుతం ఈ హరో పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకుంటు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ పాత్రల్లో అలరించిన ఆయన నేడు హీరోగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేశాడు. ఈ క్రమంలోనే.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు సుహాస్. ఆ తర్వాత.. రైటర్ పద్మభూషన్ అనే సినిమాతో మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి’ బ్యాండు సినిమాతో సుహాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా, ఈ మూవీ కూడా థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. ఇదిలా ఉంటే..సుహాస్ తాజాగా ప్రసన్నవదనం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే సుహాస్ నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ అండగా నిలుస్తున్నారట. అదేలా అంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోల్లో సుహాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రామిసింగ్ హీరో అనే పేరు తెచ్చుకున్నాడు సుహాస్. అలాగే ఎప్పుడు విభన్న కాన్సేప్ట్ లో కొత్త తరహా కథను ప్రేక్షకులకు పరిచయ చేయడంలో ఈ హీరో ముందు ఉంటాడనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇతను చేసిన సినిమాలన్నీ ఆడియాన్స్ కు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇదిలా ఉంటే.. ఇటీవలే సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు  ప్రసన్నవదనం అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. కాగా, ఈ సినిమా వచ్చే నెల అనగా మే3న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. చిత్ర యూనిట్ ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ను   జోరుగా కొనసాగిస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్‌లోని దసపల్లా కన్వెక్షన్‌లో.. సుహాస్ ప్రసన్నవదనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కాగా, దీనికి పుష్ప డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్టుగా వస్తుండటం విశేషం. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ వస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సుహాస్ సినిమా ఈవెంట్ పై మంచి బజ్ ఏర్పడింది. ఇక సలార్  ప్రాంఛైజీని తెరకెక్కిస్తున్న హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్ ..  సుహాస్ సినిమా హక్కులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రాంత పంపిణీ హక్కులను హోంబలే ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేస్తున్నారు.

కాగా, ఇలా టాప్ బ్యానర్లు సుహాస్ సినిమాను కొనడానికి ముందుకు రావడంతో.. తన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హ్యపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అర్జున్ వైకే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయ్ బల్గానిన్‌ కీలక పాత్ర పోషించారు. అలాగే పాయల్ రాధాకృష్ణ, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, రాశీ సింగ్‌, నందు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రాన్ని మణికంఠ, ప్రసాద్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మరి, సుహాస్ సిసిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్ గెస్ట్ గా రావడం పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş