iDreamPost
android-app
ios-app

Pushpa 2: పుష్ప 2 స్టోరీ లీక్! దేశాలు దాటించేస్తున్న సుక్కు..

  • Published Feb 03, 2024 | 7:47 PM Updated Updated Feb 03, 2024 | 7:47 PM

పుష్ప 2 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరకీ తెలిసిందే. ఆ అంచనాలను మించే స్థాయిలోనే కథ ఉంటుందని లీకులు వస్తున్నాయి. మరి.. ఆ కథ ఎలా ఉండబోతోందో మీరే చూడండి.

పుష్ప 2 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరకీ తెలిసిందే. ఆ అంచనాలను మించే స్థాయిలోనే కథ ఉంటుందని లీకులు వస్తున్నాయి. మరి.. ఆ కథ ఎలా ఉండబోతోందో మీరే చూడండి.

  • Published Feb 03, 2024 | 7:47 PMUpdated Feb 03, 2024 | 7:47 PM
Pushpa 2: పుష్ప 2 స్టోరీ లీక్! దేశాలు దాటించేస్తున్న సుక్కు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్– సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి పాన్ ఇండియా లెవల్లో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధారణ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీలను మాత్రమే కాకుండా.. ఆఖరికి రాజకీయ నాయకులను కూడా కదిలించింది. అందరూ తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏదైనా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అంటే అది పుష్ప కోసమనే చెప్పాలి. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుంది అంటూ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ఇటుగా అంచనాలతో వచ్చిన పుష్పరాజ్ పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రీసౌండ్ అంతా ఇంతా కాదు. అందుకే పుష్ప 2కి సంబంధించి సుకుమార్ పై బాధ్యత ఇంకా పెరిగింది. పుష్ప మార్కెట్ కూడా అలాగే పెరిగింపోయింది. అందుకే పుష్ప 2 సినిమా రేంజ్ కూడా అలాగే పెరుగుతుంది అంటున్నారు. తాజాగా పుష్ప 2కి సంబంధించి ఒక స్టోరీ లైన్ నెట్టింట వైరల్ అవుతోంది.

సాధారణంగా ఒక సినిమా హిట్టైతే ఆ తర్వాత వచ్చే సీక్వెల్ మీద భారీగా అంచనాలు నెలకొంటాయి. అంతేకాకుండా ఆ సినిమా మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకు మంచి ఉదారణగా కేజీఎఫ్ సినిమాని చెప్పచ్చు. అలాగే ఒక హిట్టైన సినిమాకి సీక్వెల్ తీస్తున్నప్పుడు డైరెక్టర్ మీద కూడా అంతే ఒత్తిడి, బాధ్యత కూడా ఉంటుంది. దానిని సుకుమార్ పక్కా ప్రణాళికతో హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అసలు కథ పుష్ప రూల్ లోనే ఉటుందని అందరికీ తెలిసిందే. సిండికేట్ ని తన చేతుల్లోకి తీసుకుని పుష్పరాజ్ ఎంత ఎత్తుకు ఎదిగాడు? ఎంత పవర్ ఫుల్ గా మారాడు అనే విషయాలు ఈ సీక్వెల్ లోనే ఉంటాయి. అంటే కథ పరంగా పుష్ప పార్ట్ 1 జస్ట్ ట్రైలర్ అనే చెప్పాలి. పార్ట్ 2లోనే అసలు కథ ఉంటుంది. అలాగే అసలు సిసలు యాక్షన్ కూడా ఉంటుంది. అలాంటి కథను సుకుమార్ అంత సింపుల్ గా అయితే తీయడు.

పుష్ప సినిమా కథని జపాన్ లో జరిగే పెళ్లి వేడుకతో సుకుమార్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఎర్రచందనానికి ఉండే డిమాండ్ గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. ఎగుమతి అవుతున్న మన దగ్గరే ఇన్ని గ్యాంగులు, ఇన్ని రాజకీయాలు, ఇన్ని గొడవలు జరుగుతుంటే.. అంత డిమాండ్ ఉన్న జపాన్ లో జరగకుండా ఉంటాయా? ఎందుకు పుష్కలంగానే జరుగుతాయి. అలాంటి మార్కెట్ లోకి పుష్పరాజ్ అడుగుపెడతాడని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 షూటింగ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం పుష్పరాజ్ జపాన్ వెళ్లబోతున్నాడు అని చెబుతున్నారు. అలాగే అక్కడ ఉన్న ఎర్రచందనం సామ్రాజ్యాన్ని కూడా పుష్పరాజ్ తన అధీనంలోకి తీసుకుంటాడని.. ఆ క్రమంలో అక్కడి వారికి పుష్పరాజ్ కి పెద్ద యుద్ధమే జరుగుతుందని చెబుతున్నారు. పార్ట్ 2లో ఇంటర్నేషనల్ విలన్ ని కూడా పరిచయం చేయబోతున్నారు అంటున్నారు.

ఒక ఎర్రచందనం కూలీ నుంచి పుష్ప రాజ్ ని ఇంటర్నేషనల్ క్రిమినల్ స్థాయికి తీసుకెళ్తున్నాడు అంటే కథలో ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్ కు కొదవ ఉండదనే చెప్పాలి. నిజంగా ఈ లైన్ నిజమే అయ్యి.. పుష్పరాజ్ జపాన్ కి వెళ్లి అక్కడి స్మగ్లింగ్ ని కూడా తన చేతుల్లోకి తీసుకుంటే థియేటర్లు దద్దరిల్లి పోతాయనే చెప్పాలి. సుక్కు ప్లానింగ్ చూస్తుంటే పుష్ప 2 గురి ఈసారి పాన్ వరల్డ్ అనే అర్థమైపోతోంది. సీక్వెల్ తో వరల్డ్ వైడ్ రికార్డులు బ్రేక్ చేసేందుకు పకడ్బందీగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంక ఈ మూవీ రిలీజ్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది. సినిమా వాయిదా పడుతోంది అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ, చివరికి చెప్పిన సమయానికే వస్తున్నాం అంటూ మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. మరి.. పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş