iDreamPost

Video: సుధీర్ బాబు ‘హరోం హర’ మూవీ ట్రైలర్ రిలీజ్! ఎలా ఉందంటే..

Harom Hara Trailer: తాజాగా సుధీర్ బాబు నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరోం హర’ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా ట్రైలర్ కూడా అంతకు మించి అన్నట్లు ఉంది.

Harom Hara Trailer: తాజాగా సుధీర్ బాబు నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరోం హర’ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా ట్రైలర్ కూడా అంతకు మించి అన్నట్లు ఉంది.

Video: సుధీర్ బాబు ‘హరోం హర’ మూవీ ట్రైలర్ రిలీజ్! ఎలా ఉందంటే..

సినిమాలు, వాటికి సంబంధించిన ట్రైలర్, టీజర్లు, గ్లింప్స్ వంటి వాటి కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొత్త సినిమాలకు సంబంధించిన సమాచారం వస్తుంటుంది. అలానే త్వరలో విడుదల కాబోయే మూవీల టీజర్ల,ట్రైలర్లు ఆకట్టుకుంటాయి. అలానే తాజాగా సుధీర్ బాబు నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరోం హర’ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ మనస్సలో శృతి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ బాబు.. ఆ తరువాత తన నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ప్రేమ కథా చిత్రమ్ తో మంచి హిట్ ను తన ఖాతాల్లో వేసుకున్నారు. ఆ తరువాత అనేక విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు సుధీర్ బాబు. గతేడాది వేట, అమ్మ మశ్చేంద్ర సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. తాజాగా హరోం హర సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.  ప్రేక్షకుల నుంచి హరోం హర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న హరోం హర సినిమాను జ్ఞాన సాగర్ ద్వారకా తెరకెక్కిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమా బ్యానర్ పై సుమంత్ జి నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో సుధీర్ బాబు సరనస మాళవిక శర్మ నటిస్తోంది. ఈ మూవీ 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ఇక ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మే 31న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో జూన్ 14న థియేటర్లలో హరోం హర సినిమా సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హరోం హర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  మహేష్ బాబు తన సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్  వైరల్ అవుతోంది. మీరు ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి