iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్..

  • Published Feb 19, 2024 | 8:35 PM Updated Updated Feb 19, 2024 | 8:35 PM

Sudev Nair- Amrdeep Kaur Marriage: టాలీవుడ్ విలన్ ఓ ఇంటివాడు అయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.

Sudev Nair- Amrdeep Kaur Marriage: టాలీవుడ్ విలన్ ఓ ఇంటివాడు అయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.

  • Published Feb 19, 2024 | 8:35 PMUpdated Feb 19, 2024 | 8:35 PM
వీడియో: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్..

సాధారణంగా వివాహం అంటేనే హడావుడిగా ఉంటుంది. ఇప్పుడు మరో మెట్టు ఎక్కి నానా హంగామా చేస్తున్నారు. కామన్ పీపులే ఇలా ఉంటే.. సెలబ్రిటీలు పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డెస్టినేషన్ వెడ్డింగ్, వేలల్లో అతిథులు.. అబ్బో మాములుగా ఉండదు మరి. కానీ, వాటికి భిన్నంగా ఈ టాలీవుడ్ విలన్ వివాహం చేసుకున్నాడు. ఎంతో సింపుల్ గా ప్రేమించిన యువతిని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవతున్నాయి. మరీ.. ఇంత ఇంపుల్ ఏంటి బ్రో అంటూ నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల టైగర్ నాగేశ్వరరావులో కూడా కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆయన గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంటివాడు అయిపోయాడు. ఆ విషయాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎక్కడా వెల్లడించలేదు. ప్రేమించిన యువతిని ఎంతో సింపుల్ గా గుడిలో వివాహం చేసుకున్నాడు. ఆమె సాధారణ వ్యక్తా అంటే.. ఆమె కూడా నటే. ఇద్దరు సెలబ్రిటీలు ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సుదేవ్ నాయర్- నటి అమర్ దీప్ కౌర్ ఇద్దరూ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. వాళ్లు తాజాగా కేరళ సాంప్రదాయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గుడిలో చాలా సాధారణంగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.

వీరి వివాహానికి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవ్వడం గమనార్హం. పెళ్లి తర్వాత గురవాయర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సుదేవ్- అమర్ దీప్ కౌర్ వివాహం చేసుకున్నారని ఫ్యాన్స్ తో పాటుగా తెలుసుకున్న సెలబ్రిటీలు కూడా వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఇద్దరు సెలబ్రిటీల సింప్లిసిటీని చూసి అభిమానులు సైతం అవాక్ అవుతున్నారు. ఇప్పుడు చాలా మంది సింపుల్ గా వివాహం చేసుకుంటున్నారు. మీరు మరీ ఇంత సింపుల్ గా చేసుకున్నారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఏదేమైనా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sajeev Janardhanan (@sajeev_janardhanan_photography)

ఇంక సుదేవ్ నాయర్ కెరీర్ విషయానికి వస్తే.. 2014లో గులాబ్ గ్యాంగ్ అనే చిత్రంలో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దక్షిణాదిన దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించాడు సుదేవ్. టాలీవుడ్ లో కూడా రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో కూడా కీ రోల్స్ ప్లే చేశాడు. మరి.. ఈ సెలబ్రిటీ జంటకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş