iDreamPost
android-app
ios-app

మేము ఏం ద్రోహం చేశాము? శుభలేఖ సుధాకర్ కన్నీరు!

  • Published Feb 17, 2024 | 5:05 PMUpdated Feb 17, 2024 | 5:05 PM

తెలుగు వారందరికి శుభలేఖ సుధాకర్ పేరు సుపరిచితమే. అయితే, తాజాగా ఈయన మీద వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందిస్తూ.. ఇకనైన వాటిని ఆపాలంటూ కన్నీరు పెట్టుకున్నారు శుభలేఖ సుధాకర్.

తెలుగు వారందరికి శుభలేఖ సుధాకర్ పేరు సుపరిచితమే. అయితే, తాజాగా ఈయన మీద వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందిస్తూ.. ఇకనైన వాటిని ఆపాలంటూ కన్నీరు పెట్టుకున్నారు శుభలేఖ సుధాకర్.

  • Published Feb 17, 2024 | 5:05 PMUpdated Feb 17, 2024 | 5:05 PM
మేము ఏం ద్రోహం చేశాము? శుభలేఖ సుధాకర్ కన్నీరు!

శుభలేఖ సుధాకర్ ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలాలో నటించి.. తెలుగు ప్రేక్షకులలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికి వయసుతో సంబంధం లేకుండా తన శక్తీకి మించి.. సినిమాలలో ఉన్న క్యారక్టర్ కు జీవం పొసే వ్యక్తి సుధాకర్. అంతే కాకుండా ప్రముఖ గాయనీమణి ఎస్పీ శైలజ భర్తగా కూడా ఈయన అందరికి సుపరిచితమే. అయితే, తాజాగా వచ్చిన యాత్ర-2 చిత్రంలో ఈయన రెడ్డి పాత్రలో నటించారు. ఆ క్యారక్టర్ కు సుధాకర్ వంద శాతం న్యాయం చేశారు. అయితే, ఈ క్రమంలో యూట్యూబ్ లో .. సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అయితే, తాజాగా వీటిపై స్పందించిన సుధాకర్.. ఆయనపై తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతూ.. మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని. ఇలా చేయడం వలన వారికి ఏం వస్తుంది అంటూ.. భావోద్వేగానికి గురయ్యారు శుభలేఖ సుధాకర్.

అయితే యూట్యూబ్ లో “సుధాకర్ కు అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి”, “శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్” ఇలా ఆయనపై థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో వీటిపై సుధాకర్ స్పందిస్తూ.. “చిరంజీవికి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. బాల సుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నపుడు .. ఆయన నిత్యం నాతో కాల్స్ మాట్లాడుతూనే ఉండేవారు. మెగాస్టార్ నా మొదటి హీరో. ఈ యూట్యూబ్ వాళ్ళు చాలా ఏళ్లుగా నా గురించి తప్పుగానే చూపిస్తున్నారు. నేను శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు. అందులో నిజం లేదని మేమిద్దరం కలిసే ఉన్నాం అని కూడా చెప్పాము. ఇలాంటి వార్తలు వచ్చినపుడు మా అమ్మగారు .. శైలజను ప్రశ్నించారు. మీ ఇద్దరు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ! అప్పుడు నేను కలుగచేసుకుని అలాంటివి ఏమి లేవని చెప్పాను. తర్వాత మళ్ళీ ఆమె నిద్రలోనే మరణించారు. ఇలాంటి సమయంలో నేను ఏం అనుకోవాలి ? ఇలాంటి వీడియోలతో యూట్యూబ్ ఛానెల్ వాళ్లకు ఏం కలిసి వస్తుంది?

ఈ ప్రపంచంలో అతి తక్కువ వృత్తి అంటే ఓ స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. వాళ్లకు కూడా మంచి ఎథిక్స్ ఉంటాయి. కానీ వీళ్లకు మాత్రం అలాంటివి ఏమి ఉండవు. ఒక్కోసారి సుధాకర్ చనిపోయాడని వీడియో పెడతారు .. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికీ నేను ఏం ద్రోహం చేశాను. కనీసం నేను ఎవరిని ఇబ్బంది కూడా పెట్టను. మీ పొట్ట నింపుకోడానికి మరొకరిని ఇలా చంపడం ఎందుకు? అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహరం ఒంటికి పడుతుందా ?ఇలాంటి వీడియోస్ చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు.” అంటూ సుధాకర్ ఎమోషనల్ అయ్యారు. మరి, తనపై వస్తున్న ట్రోలింగ్స్ విషయంలో శుభలేఖ సుధాకర్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి