iDreamPost
android-app
ios-app

అవన్నీ రూమర్స్.. యాక్సిడెంట్‌పై మంగ్లీ క్లారిటీ

తన గాత్రంలో ఓలలాడిస్తున్న గాయని మంగ్లీ. అటు ఆథ్యాత్మిక సాంగ్స్ తో పాటు ఇటు సినిమా పాటలతోనూ అలరిస్తుంది. అయితే తాజాగా ఆమె పెను ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ స్టార్ సింగర్

తన గాత్రంలో ఓలలాడిస్తున్న గాయని మంగ్లీ. అటు ఆథ్యాత్మిక సాంగ్స్ తో పాటు ఇటు సినిమా పాటలతోనూ అలరిస్తుంది. అయితే తాజాగా ఆమె పెను ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ స్టార్ సింగర్

అవన్నీ రూమర్స్.. యాక్సిడెంట్‌పై మంగ్లీ క్లారిటీ

ప్రైవేట్ ఆల్బమ్స్ నుండి స్టార్ సింగర్‌గా ఎదిగింది మంగ్లీ. భక్తి పాటలతో పాటు సినిమాల్లో పాడే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడిస్తున్న మంగ్లీ తాజాగా ప్రమాదానికి గురైందని, పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుందని వార్తలు వినిపించాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్మాత్మిక మహోత్సవానికి హాజరైన మంగ్లీ.. తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, వీటిపై స్పందించింది మంగ్లీ.

ప్రోగ్రాం ముగించుకుని తిరిగి వస్తుండగా.. శంషాబాద్ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే..కర్ణాటకకుచెందిన డీసీఎం వెనుక నుండి వేగంగా వచ్చి కారును ఢీ కొట్టిందని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు గాయపడ్డారన్న వార్తలపై మంగ్లీ స్పందించింది ‘ప్రియమైన అంందరికీ, నేను సురక్షితంగా ఉన్నారు. బాగున్నాను కూడా. అది కొన్ని రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్. అదీ కూడా చాలా చిన్నదే. రూమర్లను నమ్మకండి.. స్పెడ్ చేయకండి. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియా వేదికైన ఇన్ స్టాలో పోస్టు చేసింది. దీంతో చాలా మంది టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని అంటూ రాస్తున్నారు.

కాగా, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కన్హా శాంతి వనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి శనివారం మంగ్లీ హాజరయ్యింది. మేఘ్ రాజ్, మనోహర్ అనే వ్యక్తులతో కలిసి.. హైదరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా ఇంటికి వెళుతుండగా.. శంషాబాద్ మండలం తొండుపల్లి వంతెన వద్ద డీసీఎం వెనుక నుండి వచ్చి.. వీరు కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయని వెల్లడించారు. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇక మంగ్లీ విషయానికి వస్తే.. ఇటీవల శివరాత్రి సందర్భంగా..చెన్నైలోని ఇషా యోగా సెంటర్ లో సందడి చేసిన సంగతి విదితమే.

 

View this post on Instagram

 

A post shared by Mangli Singer (@iammangli)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి