iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోయిన్స్ ఇద్దరూ.. చిరు సరసన రెండోసారి..?

  • Author ajaykrishna Published - 06:41 PM, Sat - 28 October 23

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'మెగా 156' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ.. ఓ కొత్త జానర్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటించనున్నారని టాక్ నడుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'మెగా 156' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ.. ఓ కొత్త జానర్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటించనున్నారని టాక్ నడుస్తోంది.

  • Author ajaykrishna Published - 06:41 PM, Sat - 28 October 23
ఆ స్టార్ హీరోయిన్స్ ఇద్దరూ.. చిరు సరసన రెండోసారి..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా ఒక్కో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు.. రీసెంట్ గా భోళా శంకర్ తో నిరాశపరిచారు. కానీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. మెగా 156 గురించి చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి గానీ.. చివరికి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ కన్ఫర్మ్ అయ్యాడు. ఈసారి మెగాస్టార్ ని ఎవరూ ఊహించని రేంజ్ లో.. ఓ కొత్త జానర్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా పూజా కార్యక్రమం జరుపుకొని సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ‘మెగా156’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ కోసం ఆరా తీస్తున్నారు మెగా ఫ్యాన్స్. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ఠ.. చిరుని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి ఓవైపు కనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి.. చిరు సినిమాకు వర్క్ చేస్తున్నాడు. పైగా ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో రానుందని అంటున్నారు. ఇలాంటి ఎక్సయిటింగ్ ఎలిమెంట్స్ తో మెగా 156 రెడీ అవుతోంది. కాగా.. మెగాస్టార్ సరసన నటించబోయే హీరోయిన్స్ విషయంలో పలు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం చిరు సరసన నటించబోయే ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పేర్లు నెట్టింట, సినీ వర్గాలలో వైరల్ గా మారాయి. ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ ఎవరంటే.. అనుష్క, కాజల్ అగర్వాల్. వీరిద్దరూ కలిసి ఇదివరకు చిరుతో సినిమాలు చేశారు. అనుష్క చిరు పక్కన హీరోయిన్ గా చేయలేదు గానీ.. స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే కాజల్ అగర్వాల్.. చిరు పక్కన హీరోయిన్ గా ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ చేసింది. అయితే.. ప్రస్తుతానికి వార్తలు బయటికి రాలేదు గానీ.. దాదాపు వీరిద్దరూ కన్ఫర్మ్ అయిపోయారని కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి ఈ మెగా 156 కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet