iDreamPost
android-app
ios-app

మేజర్ మనకే లేట్ – సెన్సార్ రిపోర్ట్

  • Published May 25, 2022 | 1:26 PM Updated Updated May 25, 2022 | 1:26 PM
మేజర్ మనకే లేట్ – సెన్సార్ రిపోర్ట్

దేశవ్యాప్తంగా 9 రోజుల ముందే ప్రీమియర్లు ప్లాన్ చేసుకుని సంచలనం సృష్టించిన మేజర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాద్ లో అది కూడా ఏఎంబి మాల్ కు మాత్రమే పరిమితం చేయడం పట్ల మూవీ లవర్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక ఆట మాత్రమే ప్రదర్శించడం వల్ల సామాన్యులకు టికెట్లు దొరకవు. మీడియా ప్రతినిధులు, ఇండస్ట్రీ సెలెబ్రిటీలతోనే హాలు నిండిపోతుంది. అలాంటపుడు రెండు మూడు రోజుల పాటు ఇవి ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. అన్నిటికన్నా అసలు ట్విస్ట్ వేరే ఉంది. ఈ రోజు నుంచి మొదలైన స్పెషల్ షోలు చివరిగా ప్రదర్శించేది హైదరాబాద్ లోనే. అంటే మెయిన్ రిలీజ్ కు ఒక్క రోజు ముందు.

ఇలా చేయడానికి కారణం ఉంది. తెలుగులో ముందే వేస్తే ఇక్కడ ఎర్లీ రివ్యూలు త్వరగా స్ప్రెడ్ అవుతాయి. అవి పాజిటివ్ ఉన్నా కాకపోయినా వేగంగా ప్రచారం జరుగుతుంది. పైగా టికెట్ల కోసం ఒత్తిడి, లేనిపోనీ తలనెప్పంతా చుట్టుకుంటుంది. ముంబై పూణే లాంటి నగరాల్లో ఈ సమస్య రాదు. ఎంత ప్యాన్ ఇండియా అని చెప్పుకున్నా మేజర్ ప్రాధమికంగా తెలుగు సినిమానే. క్యాస్టింగ్ మొత్తం మనవాళ్లే. డీల్ చేసింది మన డైరెక్టరే. సో అందరికీ చూడాలనే తాపత్రయం ఉండటం సహజం. అందులోనూ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ప్రాజెక్ట్ కావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. బజ్ కు ఇది ఒక కారణమే.

సో మనకన్నా చాలా ముందు పూణే అహ్మదాబాద్ బెంగళూర్ తదితర నగరాల్లో మేజర్ సినిమాను చూసేస్తారు. ఇక్కడ జూన్ 2న ప్రీమియర్ ఉంటుంది. సాయంత్రం 7.30 గంటలకు వేస్తారు. అప్పటికి మెయిన్ రిలీజ్ కు గ్యాప్ ఒక్క రోజే కాబట్టి అంతగా మిస్ అవ్వాల్సిన పని లేదు. అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ లో ముంబై టెర్రరిస్టు దాడులను తీవ్రంగా ప్రతిఘటించి ప్రాణాలు అర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం కథను చూపించబోతున్నారు. సెన్సార్ సభ్యులు సినిమా చూశాక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని సమాచారం. ఎమోషన్స్ గొప్పగా పండాయని అంటున్నారు