iDreamPost
android-app
ios-app

SSMB29: వీడియో: రాజమౌళి సినిమా కోసం మహేష్‌ న్యూలుక్‌ ఇదే.. ఊర మాస్‌గా

  • Published Apr 19, 2024 | 3:56 PM Updated Updated Apr 19, 2024 | 3:56 PM

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తోన్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తోన్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Apr 19, 2024 | 3:56 PMUpdated Apr 19, 2024 | 3:56 PM
SSMB29: వీడియో: రాజమౌళి సినిమా కోసం మహేష్‌ న్యూలుక్‌ ఇదే.. ఊర మాస్‌గా

టాలీవుడ్‌లో మోస్ట్‌ క్రేజియెస్ట్‌ కాంబినేషన్‌ అయిన దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమా ఎట్టకేలకు సెట్స్‌ మీదకు వెళ్లబోతుంది. ఆఫ్రికన్‌ అడవులు నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్‌ బాబు భారీగా కష్టపడక తప్పదని ప్రచారం జరుగుతోంది. అసలు జక్కన్న సినిమా అంటేనే హీరోలకు మిలిట్రీ తరహా శిక్షణ అని ఫీలవుతారు. అదలా ఉంచితే మహేష్‌ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ మూవీపై ఇండియా వైడ్‌గా క్రేజ్‌ నెలకొని ఉంది. ఇక ఈ సినిమా గురించి రోజుకొక అప్డేట్‌ వెలుగులోకి వస్తూనే ఉంది.. సినిమాపై అంచనాలను పెంచుతూనే ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యిందని.. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ప్రకటించాక.. మహేష్‌, రాజమౌళి ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు కూడా.

ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్‌ చేస్తోంది. తొలిసారి రాజమౌళి, మహేష్‌ బాబు పక్కపక్కనే కనిపించారు. కొన్ని రోజుల క్రితం మహేష్‌ తన కుటుంబంతో కలిసి యూరప్‌ ట్రిప్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహేష్‌ అటు నుంచి అటే దుబాయ్‌ వెళ్లాడు. రాజమౌళి కూడా వెళ్లాడు. దుబాయ్ లో వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించే డిస్కషన్స్ జరిగినట్టు, ఆ సినిమా పని మీదే వెళ్లినట్టు సమాచారం. నేడు అనగా శుక్రవారం ఉదయం రాజమౌళి–మహేష్ ఇద్దరూ కలిసి దుబాయ్ నుంచి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి వస్తోన్న విజువల్స్‌.. వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్‌ అవుతోంది. దీనిలో మహేష్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌, నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఊర మాస్‌ లుక్కులో అదిరిపోయాడుగా అంటున్నారు. లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో రఫ్‌ లుక్‌లో కనిపించాడు మహేష్‌. రాజమౌళి సినిమా కోసమే బాబు ఇలా మేకోవర్‌ అయ్యాడని అంటున్నారు. లుక్కుతోనే సినిమాపై క్రేజ్‌ పెంచాడని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు చివరగా గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Meme Raja (@meme_raaja)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş