iDreamPost
android-app
ios-app

మహేశ్ ఫ్యాన్స్ కి తమన్ ప్రామిస్.. గుంటూరు కారం నుంచి మరో సర్ ప్రైజ్!

  • Published Jan 30, 2024 | 4:34 PM Updated Updated Jan 30, 2024 | 4:34 PM

Thaman Promises Mahesh Fans: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మహేశ్ ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. వారిని త్వరలోనే సర్ ప్రైజ్ చేస్తానని చెప్పాడు.

Thaman Promises Mahesh Fans: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మహేశ్ ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. వారిని త్వరలోనే సర్ ప్రైజ్ చేస్తానని చెప్పాడు.

  • Published Jan 30, 2024 | 4:34 PMUpdated Jan 30, 2024 | 4:34 PM
మహేశ్ ఫ్యాన్స్ కి తమన్ ప్రామిస్.. గుంటూరు కారం నుంచి మరో సర్ ప్రైజ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. పనిగట్టుకుని నెగిటివ్ చేయాలని చూసినా కూడా మహేశ్ ఫ్యాన్స్ ఈ మూవీకి అండగా నలిబడ్డారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మహేశ్ కు డీసెంట్ హిట్టుని అందజేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకుపై గా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం ఎక్కడా క్రేజ్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అమ్మా సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంకో సర్ ప్రైజ్ ఉందంటూ తమన్ చెప్తున్నాడు.

గుంటూరు కారం సినిమాకి తమన్ బిగ్గెస్ట్ అసెట్ అనే విషయం అందిరికీ తెలిసిందే. ఈ మూవీలో వచ్చిన అన్ని మ్యూజిక్ నంబర్స్ మ్యాజిక్ చేశాయి. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ కి అయితే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ యూట్యూబ్, రీల్స్, షార్ట్స్ అంటూ ఆ పాట వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటివరకు తమన్ మొత్తం సూపర్ సిక్స్ ట్రాక్స్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఖుషీ చేశాడు. తాజాగా ఇంకో సర్ ప్రైజ్ ఉందంటూ ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. అదేంటంటే ఇంకో లిరికల్ వీడియోను విడుదల చేస్తానని చెప్తున్నాడు. అది కచ్చితంగా మహేశ్ ఫ్యాన్స్ ని అలరించేదిగానే ఉంటుందని చెప్తున్నాడు.

ఆ వీడియో రెడీ అయిన తర్వాత దానిని మహేశ్ ఫ్యాన్స్ కోసం మరింత ప్రత్యేకంగా మారుస్తానంటూ మాటిస్తున్నాడు. అతి త్వరలోనే నంబర్ 7 ట్రాక్ ని విడుదల చేస్తానంటూ తమన్ చెప్పున్నాడు. ఈ వార్త వినగానే మహేశ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న ఆరు ట్రాకులకే పూనకాలతో ఊగిపోతుంటే.. ఏడో ట్రాక్ తెస్తాను అనడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పైగా అది చాలా స్పెషల్ గా ఉంటుందంటూ తమన్ ప్రామిస్ చేయడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయ. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తాడా అంటూ ఎదురుచూపులు స్టార్ట్ చేశారు.

మహేశ్ బాబు సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు కారం తర్వాత రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో తీసుకొస్తున్నారు. అమెజాన్ అడవుల్లో, ఇండియానా జోన్స్ స్టోరీ లైన్ తో తెరకెక్కించబోతున్నారు అని చెబుతున్నారు. అలాగే ఈ మూవీ బడ్జెటే రూ.వెయ్యి కోట్లు ఉంటుందని ఇప్పటికే చాలానే ప్రచారాలు జరుగుతున్నాయి. పైగా ఈ సినిమా కోసం మహేశ్ ఏకంగా మూడేళ్ల పాటు డేట్స్ లాక్ చేసేందుకు కూడా రెడీ అయ్యాడంట. ఈ అన్నీ వార్తలు చూస్తుంటే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. మరి.. మహేశ్ ఫ్యాన్స్ కి తమన్ సర్ ప్రైజ్ ఇస్తాననడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique