iDreamPost
android-app
ios-app

థమన్ ఫన్నీ రనౌట్.. రియల్ క్రికెట్ లో కూడా ఇలాంటి ఔట్ చూసి ఉండం!

  • Published Mar 02, 2024 | 10:08 PM Updated Updated Mar 02, 2024 | 10:08 PM

SS Thaman Funny Run Out: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో థమన్ మెరుపులు కొనసాగిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తన బ్యాటుతో చెలరేగాడు.

SS Thaman Funny Run Out: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో థమన్ మెరుపులు కొనసాగిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తన బ్యాటుతో చెలరేగాడు.

  • Published Mar 02, 2024 | 10:08 PMUpdated Mar 02, 2024 | 10:08 PM
థమన్ ఫన్నీ రనౌట్.. రియల్ క్రికెట్ లో కూడా ఇలాంటి ఔట్ చూసి ఉండం!

ఎస్ఎస్ థమన్.. పాన్ ఇండియా లెవల్లో ఈ పేరు ఎప్పుడూ రీసౌండింగ్ ఇస్తూనే ఉంటుంది. తనదైన స్టైల్ లో అదిరిపోయే ట్యూన్లు ఇస్తూ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తూ ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో థమన్ కు ఇప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంది. మ్యూజిక్ కాకుండా థమన్ పేరు ఇంకో విషయంలో కూడా మారుమోగుతూ ఉంటుంది. అదేంటంటే.. క్రికెట్. అవును థమన్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలుగు ప్రేక్షకులకు చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థమన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరఫున దున్నేస్తున్నాడు. అయితే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం చాలా ఫన్నీగా అవుట్ అయ్యాడు.

శుక్రవారం తెలుగు వారియర్స్- పంజాబ్ జట్టుతో తలపడింది. తొలి ఇన్నింగ్స్ లో తడబడిన తెలుగు వారియర్స్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో పుంజుకుంది. పైగా ఓటమి తప్పదు అనుకున్న స్థితి నుంచి విజయ సాధించింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా థమన్ విధ్వసం గురించి మాట్లాడుకోవాలి. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులకే అవుట్ అయిన థమన్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 30 బంతుల్లో 67 పరుగులతో చెలరేగాడు. మ్యాచ్ లో థమన్ కొట్టిన ఒక షాట్ కి బ్యాట్ రెండు ముక్కలు అయ్యింది. ఇంక బౌండరీల మీద బౌండరీలు కొడుతూ చెలరేగాడు. అయితే థమన్ విధ్వంసం ఎంత హైలెట్ అయ్యిందో.. అలాగే థమన్ అవుట్ అయిన తీరు కూడా అంతే వైరల్ అయ్యింది. ఇలాంటి రన్ అవుట్ మీరు రియల్ క్రికెట్ లో కూడా చూడలేదు.

షాట్ ఆడి.. పరుగు కోసం థమన్ ప్రయత్నిస్తాడు. అయితే బాల్ బౌలర్ కి దగ్గర్లోనే ఉంటుంది. థమన్ పరుగు పూర్తి చేయలేను అని ఫిక్స్ అయిపోయినట్లు కనిపించాడు. యాధృచ్ఛికంగా చేశాడో.. కావాలని చేశోడా తెలీదు. కానీ, బౌలర్ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. అంతేకాకుండా.. వికెట్స్ కి కూడా అడ్డుగా వెళ్లాడు. ఇంకేముంది.. ఫీల్డింగ్ కు అంతరాయం కలిగించినందుకు థమన్ ని రనౌట్ గా ప్రకటించారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చాలామంది ఈ రనౌట్ పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. థమన్ బ్యాటుతోనే కాకుండా.. రనౌట్ గా కూడా ఆడియన్స్ అలరించాడు. ప్రస్తుతం ఈ రనౌట్ పై పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మీమర్స్ కూడా థమన్ రనౌట్ పై ఫన్నీ ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. శనివారం కేరళతో తెలుగు వారియర్స్ మ్యాచ్ నిర్వహించారు. మరి.. థమన్ రనౌట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom