Nagendra Kumar
ఒక దర్శకుడు మరో దర్శకుడి చిత్రాన్ని మెచ్చుకోవడానికి చాలా మెచ్యూరిటీ కావాలి. అలాటిది డెబ్యూ డైరెక్టర్ని ప్రపంచస్థాయిలో మహా దర్శకుడు అనిపించుకున్న దర్శకశిఖరం మెచ్చుకోవడం, ఆ దర్శకుడి ప్రయత్నాన్ని కొనియాడడం అంటే మాటలు కాదు. ఇటువంటి గొప్ప అనుభవం సినిమా రిలీజుకి ముందే న్యూ డైరెక్టర్ విద్యాధర్ కాగితకు లభించింది.
ఒక దర్శకుడు మరో దర్శకుడి చిత్రాన్ని మెచ్చుకోవడానికి చాలా మెచ్యూరిటీ కావాలి. అలాటిది డెబ్యూ డైరెక్టర్ని ప్రపంచస్థాయిలో మహా దర్శకుడు అనిపించుకున్న దర్శకశిఖరం మెచ్చుకోవడం, ఆ దర్శకుడి ప్రయత్నాన్ని కొనియాడడం అంటే మాటలు కాదు. ఇటువంటి గొప్ప అనుభవం సినిమా రిలీజుకి ముందే న్యూ డైరెక్టర్ విద్యాధర్ కాగితకు లభించింది.
Nagendra Kumar
విష్వక్సేన్ మెయిన్ లీడ్ తో విద్యాధర్ తెరకెక్కించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన విడుదలవుతున్న సందర్భంలో దర్శకమౌళి రాజమౌళి గామి సినిమా నిర్మాణ విశేషాలను దర్శకనిర్మాతల నుంచి విని వాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు. వి సెల్యూలాయిడ్ సమర్ఫణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన గామి చిత్రం వెనుక దర్శకనిర్మాతల నాలుగేళ్ళ కష్టం, ప్రయాస, స్ట్రగుల్ గురించి తెలుసుకుని రాజమౌళి కరిగిపోయాడు. కళని పవిత్రంగా ప్రేమించే ఓ కళాప్రియుడిగా రాజమౌళి ప్రశంసలు గామి సినిమాకి తిరుగులేని ఊఫింగ్ నిచ్చాయి.
సోషల్ మీడియా మొత్తం రాజమౌళి పోస్ట్ నాన్ స్టాప్ గా వైరల్ అవుతూ, గామి సినిమా పట్ల అమితమైన ఆసక్తిని, ఎక్సైట్ మెంటుని పెంచేసింది. ‘’కలని నిజం చేయడం అసాధ్యమైతే, అసాధ్యమైన కలలను నిజం చేయడమంటే బద్దలైపోతుంది. కానీ గామి దర్శకనిర్మాతలు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. నాలుగేళ్ళ కష్టమైన ప్రయాణంలో అద్భుతమైన విజువల్స్ ని కేప్చర్ చేయడానికి వాళ్ళు పడ్డ శ్రమ నిజంగా అభినందనీయం. కార్తీక్, విద్యాధర్ వచ్చి అవన్నీ చెప్పినప్పుడు నాకనిపించింది అదే. వాళ్ళకి అభినందనలు. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్’’ అని పోస్ట్ పెట్టాడు రాజమౌళి.
గామి చిత్రంలో విష్వక్సేన్ అఘోరా క్యారెక్టర్ పోషించడం ఒక స్పెషల్ టచ్ సినిమాకి. ఒక అసాధారణమైన సమస్యను ఫేస్ చేసే ప్రయత్నంలో విష్వక్సేన్ క్యారెక్టర్ ముందుకు సాగుతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత గామి సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుకోవడం మొదలైంది. ముఖ్యంగా టెక్నికల్ వేల్యూస్ విషయంలో గామి హండ్రెడ్ పర్సంట్ స్కోర్ చేయడానికి ట్రైలర్ బాగా హెల్ప్ అయింది. హెవీ టాక్ తో రిలీజ్ కి ముస్తాబైన గామి చిత్రానికి రాజమౌళి పోస్ట్ ప్రభంజనాన్నే రేపింది.