iDreamPost
android-app
ios-app

వీడియో: రాజమౌళి కొత్త అవతారం.. ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసుండరు!

వీడియో: రాజమౌళి కొత్త అవతారం.. ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసుండరు!

దర్శకధీరుడు రాజమౌళి అంటే ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు జక్కన్న అని పేరు ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన మైండ్ లో అనుకున్న రేంజ్ లో సీన్ వచ్చే వరకు వన్ మోర్ అని చెబుతూనే ఉంటారు. భారతదేశ సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా కీర్తిని ఆస్కార్ వరకు చేర్చిన ఘనత మాత్రం రాజమౌళికే దక్కుతుంది. ట్రిపులార్ సినిమాతో మొత్తం ప్రపంచం భారత్ వైపు, తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు. అలాంటి జక్కన్న ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు.

ఎస్ఎస్ రాజమౌళి అనగానే అందరికీ ఆయన తెరకెక్కించిన అద్భుతమైన సీన్స్, ఆయన డైరెక్షన్ స్కిల్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు జక్కన్న అనగానే మీకు మరో విషయం కూడా గుర్తొస్తుంది. మొన్నీమధ్య వైట్ బ్లేజర్ వేసుకుని ఎంతో ట్రెండీగా ఉన్న రాజమౌళి వీడియో నెట్టింట వైరల్ అవడం చూశాం. అదేదో కార్యక్రమం కోసం అలా రెడీ అయ్యారు అనుకున్నారు. కానీ, అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. రాజమౌళి ప్రమోషన్స్ ప్రారంభించారు.

ఒప్పో ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా జక్కన్న వ్యవహరిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను ఒప్పో విడుదల చేసింది. డైరెక్టర్ గా కెమెరా వెనుక మెప్పించిన రాజమౌళి.. అంబాసిడర్ గా యాడ్ లో ఎంతో చక్కగా నటించారు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో అందరినీ ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యంగా ఒప్పో కొత్త మోడల్ కెమెరాని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఆ యాడ్ ఉంది. “ఒక రాజమౌళి చాలు.. మరి ఇద్దరైతే? ఎంతో అద్భుతమైన ఆవిష్కరణ మీ ముందుకు రాబోతోంది” అంటూ ఒప్పో చెప్పుకొచ్చింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss