iDreamPost
android-app
ios-app

రాములువారే హనుమంతుడి కోసం వస్తున్నారు!

Hanuman Movie: యంగ్ హీరో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి నిర్మాత నిరంజన్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.

హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేస్తున్న విన్యాసం అందరినీ ఆకట్టుకునేలా, మెస్మరైజింగ్ గా ఉంది. ఇప్పటికే హనుమంతుడి అత్యంత శక్తివంతమైన స్తోత్రం లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రతీ ఫ్రేంలో హనుమంతుడి కటౌట్స్ ఒళ్ళు గగుర్పొడిచే విధంగా అద్భుతంగా అనిపించాయి. హనుమంతుడిని మించిన మాస్ హీరో, ఆబాలగోపాలాన్ని ఆకర్షించగల పాత్ర మరొకటి లేనేలేదు పురాణాల పరంగా గానీ, భక్తుల విశ్వాసాల పరంగా గానీ. అందుకే చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ వరకూ అందరూ ఏ అవాంతరం వచ్చినా తమకు హనుమంతుడి దీవెనలున్నాయి, ఆయనే కాచి, కాపాడి, రక్షించి, విజయపథంలో నడిపిస్తాడనే నమ్మకాన్ని తమ మాటల్లో ప్రతీ ఇంటర్వ్యూలో వ్యక్తం చేస్తున్నారు.

ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో కూడా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ సినిమా మొదటి నుంచి జరిగిన విధానం కూడా ఎలాగైతే హనుమంతుడు సూక్ష్మరూపం నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూప ప్రదర్శన చేస్తాడో అలాగే పెరుగుతూ వచ్చిందని చెప్పారు. మొదట దశలో ఓ స్థాయిలో చేద్దామని ప్రారంభిస్తే, అది ప్రతీ దశలో పెరిగిపోతూ, తమ శక్తి సామర్ధ్యాలను కూడా పెంచుకుంటూ వచ్చిందని, హనుమంతుడి అనుగ్రహం తమ టీం మీద పరిపూర్ణంగా ఉందని, అందుకు ట్రైలర్ సాధించిన పాప్యులారిటీయే సజీవ నిదర్శనమని చెప్పుకున్నారు.

ఇందులో చమత్కారం అనండి, మహిమ అనండి, రేపు సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నదీ హనుమాన్ సినిమా అంటే….అందరికన్నా పెద్ద హీరో, దేశం మొత్తం మీద ఆరాధించే మహా కథానాయకుడు ఆంజనేయస్వామి అన్నది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. ఆంజనేయస్వామి పాత్రను చొప్పించి చేసిన సినిమాలన్నీ కూడా ఇంతవరకూ ల్యాండ్ మార్క్ హిట్స్ అయ్యాయన్నది కూడా చరిత్ర చెబుతున్న నిజం.

hanuman movie sri ramadootha song realeased

ఇందులో చమత్కారం అనండి, మహిమ అనండి, రేపు సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నదీ హనుమాన్ సినిమా అంటే….అందరికన్నా పెద్ద హీరో, దేశం మొత్తం మీద ఆరాధించే మహా కథానాయకుడు ఆంజనేయస్వామి అన్నది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. ఆంజనేయస్వామి పాత్రను చొప్పించి చేసిన సినిమాలన్నీ కూడా ఇంతవరకూ ల్యాండ్ మార్క్ హిట్స్ అయ్యాయన్నది కూడా చరిత్ర చెబుతున్న నిజం.

జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలవుతున్న హనుమాన్ పెద్ద సినిమాలతో సరిసాటిగా టాక్ ఆప్ ది ట్రేడ్ గా మారిందంటే హనుమంతుడి పాత్రే దానికి ప్రధాన కారణం. పైగా జనవరి 22న ప్రాణప్రతిష్ట జరుపుకోబోతున్న రామమందిరం ముందుగానే హనుమాన్ రిలీజ్ కావడం కూడా కలిసొచ్చిన అంశం. అయితే తాము రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుగుణంగా రిలీజ్ డేట్ అనుకోలేదని, మున్ముందు తామే డేట్ ప్రకటించామని, రాములవారే భక్తుడైన హనుమంతుడి మీద ప్రేమతో ఆయనకు తోడు వస్తున్నారని భక్తిపూర్వకంగా నిర్మాత నిరంజన్ రెడ్డి చెప్పడం ఆసక్తికరం.