iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని చిన్నారులు.. స్టార్ హీరోయిన్, హీరో. . ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 27, 2024 | 1:45 PM Updated Updated Aug 27, 2024 | 1:45 PM

ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారు కదా.. ఇద్దరు ఆ స్టార్ నటికి కజిన్స్. ఒకరేమో తెలుగు ఇండస్ట్రీని ఏలితే.... మరొకరు తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరంటే..?

ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు కనిపిస్తున్నారు కదా.. ఇద్దరు ఆ స్టార్ నటికి కజిన్స్. ఒకరేమో తెలుగు ఇండస్ట్రీని ఏలితే.... మరొకరు తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరంటే..?

  • Published Aug 27, 2024 | 1:45 PMUpdated Aug 27, 2024 | 1:45 PM
ఈ ఫోటోలోని చిన్నారులు.. స్టార్ హీరోయిన్, హీరో. . ఎవరో గుర్తుపట్టారా..

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దర్ని గుర్తు పట్టారా..? సినీ సెలబ్రిటీలిప్పుడు. ఒకరు ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీ. అయితే మరొకరు స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న యాక్టర్. ఈ ఇద్దరు కూడా ఓ స్టార్ నటికి కజిన్స్. ఇందులో కనిపిస్తున్న ఓ పాప.. తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన నటి. తన మాట తీరుతో కుర్రాళ్లను వలలో వేసుకున్న స్టార్ హీరోయిన్. చెప్పాలంటే డ్రీమ్ గర్ల్ టైప్. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో మెరిసింది. చెన్నైలో పుట్టినప్పటికీ.. తెలుగమ్మాయే. ఇప్పుడు తెలుగింటి కోడలు అయ్యింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉందా..? ఈ క్యూటీ ఎవరంటే.. మ..మ..మహేశ్వరి. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు వరుస అవుతుంది (అందరూ చెల్లెలనే భావిస్తారు). గులాబి మూవీలో ‘ఓరేయ్ చందు’ అంటూ జేడీ చక్రవర్తిని ఫోనులో ఆటపట్టంచే సీక్రెట్ లవర్‌గా మెస్మరైజ్ చేసింది. అయితే చాలా మంది ఆమెకు గులాబి ఫస్ట్ మూవీ అనుకుంటారు.

కానీ మ్యాగీ అమ్మాయి కాపురంలో కీ రోల్ చేసింది. ఇందులో ఆలీ హీరోగా నటించాడు. ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించి గులాబితో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది మహి. అందులో ఆమె నటనతో మెస్మరైజ్ చేసింది. 17 ఏళ్ల వయస్సులోనే భారతీరాజా తెరకెక్కించిన తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సౌందర్య రాశి.. తెలుగులో వరుస చిత్రాలతో అలరించింది. సుమన్ ఖైదీ ఇన్ స్పెక్టర్‌లో కనిపించింది. తెలుగులో జేడీ చక్రవర్తి, మహేశ్వరి బెస్ట్ పెయిర్‪గా పేరు తెచ్చుకన్నారు. ఈ ఇద్దరి కాంబోలో మూడు చిత్రాలు వచ్చాయి. గులాబి, దెయ్యం, మృగం సినిమాలు చేశారు. కొన్ని ప్లాపుల తర్వాత ఆమెకు కంబ్యాక్ హిట్ ఇచ్చిన చిత్రం పెళ్లి. వడ్డే నవీన్ హీరోగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మళ్లీ బిజీగా మారింది.

actress maheswari pic talk

జగపతి బాబు ప్రియరాగాలు, నవ్వులాట, ఓ పనైపోతుంది బాబు, మా బాలాజీ, ప్రేమించేది ఎందుకమ్మా, రామసక్కనోడు, వెలుగు నీడలు వంటి చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు నంది అవార్డును ఇచ్చిన చిత్రం నీకోసం. రవితేజ హీరోగా, శ్రీను వైట్ల డెబ్యూ డైరెక్టరుగా తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. బలరామ్, మా అన్నయ్య, నాగులమ్మ, తిరుమల తిరుపతి వెంకటేశ వంటి చిత్రాల్లో నటించింది. 2008లో జయకృష్ణ అనే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని మూవీస్‌కు స్వస్థి పలికింది. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసింది. మై నేమ్ ఈజ్ మంగతయారు సీరియల్లో నవ్వించింది. దీన్ని శ్రీదేవి ప్రమోట్ చేయడం విశేషం. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో గెస్టుగా వచ్చింది మ్యాగీ. ఇక ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. అతడి పేరు ఉదయ్ కార్తీక్ కుమార్ అలియాస్ ఉదయ్ అవిషేక్ కార్తీక్. గౌతమ్ మీనన్ దగ్గర అసోసియేట్‌గా చేసిన ఇఇతడు.. హీరోగా సినిమాలు చేస్తున్నాడు. సెల్వకుమార్.. తిరుమారన్ దర్శకత్వంలో ఫ్యామిలీ పదం అనే మూవీ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Mahe Ayyappan (@maheswari_actress)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişdinamobet girişgrandpashabet