iDreamPost
android-app
ios-app

Sreemukhi: లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి.. స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీలో..

  • Published Apr 06, 2024 | 3:30 PM Updated Updated Apr 06, 2024 | 3:30 PM

స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ పాన్ ఇండియా మూవీలో అవకాశం కొట్టేసినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో నటిస్తున్న ఈ మూవీలో అతడికి చెల్లెలుగా నటిస్తుందని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ పాన్ ఇండియా మూవీలో అవకాశం కొట్టేసినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో నటిస్తున్న ఈ మూవీలో అతడికి చెల్లెలుగా నటిస్తుందని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 06, 2024 | 3:30 PMUpdated Apr 06, 2024 | 3:30 PM
Sreemukhi: లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి.. స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీలో..

శ్రీముఖి.. బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్ర్యతేక గుర్తింపును తెచ్చుకుంది. రాములమ్మగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ యాంకర్ బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉంటూనే.. అవకాశం దొరికినప్పుడల్లా వెండితెరపై కనిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా శ్రీముఖి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ సినిమాలో అవకాశం దక్కించుకుందన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏది? ఆ హీరో ఎవరు? తెలుసుకుందాం పదండి.

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీ ఏదంటే? స్టార్ డైరెక్టర్ అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ లో శ్రీముఖి నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బన్నీకి చెల్లెలుగా మరోసారి ఆమె కనిపించనున్నారు. ఇప్పటికే శ్రీముఖి జులాయి మూవీలో బన్నీకి చెల్లెలుగా నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు అన్నా-చెల్లెలుగా కనిపించనున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది.

అయితే ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో ఖుషీ మూవీ నడుము సీన్ రీ క్రియేషన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ.. కుర్రకారు గుండెలను మెలిపెడుతూ ఉంటుంది. మరి ఐకాన్ స్టార్-అట్లీ మూవీలో శ్రీముఖి ఛాన్స్ కొట్టేసిందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

ఇదికూడా చదవండి: Family Star: ఫ్యామిలీ స్టార్ డే 1 కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet