iDreamPost
android-app
ios-app

NBK 108 శ్రీలీల – డాటరాఫ్ బాలయ్య

  • Published May 23, 2022 | 6:36 PM Updated Updated May 23, 2022 | 6:36 PM
  • Published May 23, 2022 | 6:36 PMUpdated May 23, 2022 | 6:36 PM
NBK 108 శ్రీలీల – డాటరాఫ్ బాలయ్య

పెళ్లిసందD ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ఆ హీరో హీరోయిన్లు రోషన్ శ్రీలీలకు వచ్చిన పేరు పెద్దదే. ఇద్దరిలోనూ మంచి టాలెంట్ తో పాటు అందం అభినయం రెండూ ఉండటంతో నిర్మాతలు వరస ఆఫర్లతో ఉక్కిరిబిక్కరి చేశారు. రోషన్ ఆల్రెడీ మైత్రి లాంటి బడా సంస్థల ప్రాజెక్టులు చేస్తున్నాడు. శ్రీలీల ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకాలో ఛాన్స్ కొట్టేసింది. వయసులో అంత సీనియర్ స్టార్ తో చేయడం గురించి కామెంట్స్ వచ్చినప్పటికీ సినిమా చూశాక కానీ తను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో తెలుస్తుంది. ఇది కాకుండా గాలి జనార్దన్ కొడుకుని పరిచయం తీస్తున్న భారీ ప్యాన్ ఇండియా మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది.

నితిన్ వక్కంతం వంశీ కాంబోలో లాక్ అయ్యింది. రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న సెల్ఫిష్ లో తనే జోడి. ఇవి కాకుండా లేటెస్ట్ గా అందిన అప్డేట్ ప్రకారం బాలకృష అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరో కూతురిగా నటించబోతున్నట్టు తెలిసింది. ఎఫ్3 ప్రమోషన్ ఇంటర్వ్యూలలో భాగంగా అడిగిన ప్రశ్నకు అనిల్ ఇలా చెప్పడంతో ఒక్కసారిగా అందరికీ ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు బాలకృష్ణ తండ్రిగా నటించడం ఇప్పటిదాకా జరగలేదు. మరి శ్రీలీలకు ఒప్పుకున్నారంటే అనిల్ రావిపూడి చెప్పిన నెరేషన్ లోనో కథలోనో అంత ఎగ్జైటింగ్ పాయింట్ ఉందన్న మాట.

గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా అవ్వగానే బాలయ్య ఈ సెట్స్ లో జాయిన్ అవుతారు. మరి శ్రీలీల ఇతర ఒత్తిడి ఉన్న పాత్రను ఎలా చేస్తుందో చూడాలి. గతంలో వయసు మళ్ళిన పాత్రలు బాలకృష్ణ చాలా చేశారు. కానీ ఇది డిఫరెంట్ గా ఉంటుందట. ఆయన మార్క్ మాస్ మేనరిజంస్ తో పాటు అనిల్ బ్రాండ్ కామెడీని సమంగా జొప్పిస్తారట. ఆ మధ్య రజనీకాంత్ దర్బార్ లో నివేదా థామస్ కూతురిగా నటిస్తే ఆ కాంబో పడింది. అందులోనూ బాలయ్యని కొత్తగా ప్రెజెంట్ చేస్తామని చెబుతున్న అనిల్ రావిపూడి ఒక్కసారి నందమూరి అభిమానుల్లో ఉత్సాహం తీసుకొచ్చారు. శ్రీలీలకు పెరఫార్మన్స్ పరంగా ఇది మంచి ఛాన్సే.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş