యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు టాలీవుడ్ లో స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు అందరు హీరోలతో సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిన ఈ భామ.. నెలకో సినిమా రిలీజ్ కి రెడీ చేస్తోంది. కాగా.. టీనేజ్ లోనే సినిమాల్లోకి వచ్చిన శ్రీలీల.. వరుస హిట్స్ తో తన క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో ఆల్రెడీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా యూత్ కి శ్రీలీల మోస్ట్ ఫేవరేట్ అయిపోయింది. అందం, అభినయం ఇలా అన్నివిధాలా అమ్మడికి బాగా కనెక్ట్ అయిపోయారు తెలుగు యూత్. కాగా.. ఇప్పుడు శ్రీలీల నటిస్తున్న సినిమాలలో ‘స్కంద’ ముందుగా రాబోతుంది.
హీరో రామ్ పోతినేని, బోయపాటి శీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ మూవీ.. సెప్టెంబర్ 15న రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే స్కంద నుండి విడుదలైన సాంగ్స్ లో.. శ్రీలీల ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ చూశాం. పాట ఏదైనా డాన్స్ పెర్ఫార్మన్స్ పరంగా శ్రీలీల తనవంతు న్యాయం చేస్తూ వస్తోంది. సీనియర్ హీరోలైతే అమ్మడిదే పై చేయి అని చెప్పక్కర్లేదు. ఇక స్కంద ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి క్షమించమని లెటర్ రాసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. అదేంటీ శ్రీలీల శేఖర్ మాస్టర్ కి లెటర్ రాసి మరి సారీ చెప్పిందంటే.. విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.
ఈ విషయమై శ్రీలీల మాట్లాడుతూ.. ఒక సినిమా సాంగ్ షూటింగ్ లో ఎక్కువ టేక్స్ తీసుకొని చాలా ఫీల్ అయ్యాను. నాకు ఎక్కువ టేక్స్ తీసుకోవడం అసలు నచ్చదు. ఎందుకంటే.. షూటింగ్స్ లో ఎక్కువ టేక్స్ తీసుకుంటే అటు టైమ్ వృధా అవ్వడమే కాకుండా.. ప్రొడ్యూసర్ కి ఖర్చు పెరిగిపోతుంది. అలా ఓసారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 30 టేక్స్ తీసుకున్నా. ఆ పాట కోసం ఎంత రిహార్సల్స్ చేసినా అలాగే జరిగింది. అలా ఎక్కువ టేక్స్ తీసుకొని చాలా బాధపడ్డాను. షూటింగ్ అయిపోయాక.. ఇంటికెళ్లి శేఖర్ మాస్టర్ ని క్షమించమని కోరుతూ మూడు పేజీల లెటర్ రాసాను. అది చూసి శేఖర్ మాస్టర్ కాల్ చేసి.. నీ తప్పేం లేదు. పాటలో ఎక్కువమంది డాన్సర్స్ ఉండటం వల్ల బ్యాక్ గ్రౌండ్ లో స్టెప్స్ మిస్ అయ్యాయి. అందుకే అన్ని టేక్స్ తీసుకున్నాం అని చెప్పారు.” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీలీల మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి శ్రీలీల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.