iDreamPost
android-app
ios-app

శ్రీలీల కొత్త కండీషన్.. స్టార్ హీరోకైనా నో చెప్పేస్తుందట!

  • Published Jul 30, 2024 | 1:47 PM Updated Updated Jul 30, 2024 | 1:47 PM

Sreeleela New Condition: యంగ్ హీరోయిన్ శ్రీలీల కొత్త ప్రాజెక్ట్ లు ఒప్పుకునే విషయంలో మేకర్స్ కు ఓ కండీషన్ పెడుతోందట. దానికి ఓకే చెప్పకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా చేయనని నిర్మొహమాటంగా చెప్పేస్తోందట. మరి ఆ కండీషన్ ఏంటి?

Sreeleela New Condition: యంగ్ హీరోయిన్ శ్రీలీల కొత్త ప్రాజెక్ట్ లు ఒప్పుకునే విషయంలో మేకర్స్ కు ఓ కండీషన్ పెడుతోందట. దానికి ఓకే చెప్పకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా చేయనని నిర్మొహమాటంగా చెప్పేస్తోందట. మరి ఆ కండీషన్ ఏంటి?

శ్రీలీల కొత్త కండీషన్.. స్టార్ హీరోకైనా నో చెప్పేస్తుందట!

శ్రీలీల.. టాలీవుడ్ లోకి రాకెట్ వేగంతో దూసుకొచ్చింది ఈ యంగ్ బ్యూటీ. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేసింది. మాస్ మహరాజ రవితేజతో ‘ధమాకా’ లాంటి బ్లాక్ బస్టర్  అందించింది. ఆ తర్వాత కూడా ఎక్కడా ఆగకుండా వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ పరిశ్రమలో ఛార్మింగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే గుంటూరు కారం తర్వాత మాత్రం ఈ అమ్మడు కాస్త దూకుడు తగ్గించిందనే చెప్పాలి. పైగా ఇప్పుడు కొత్త కండీషన్ కూడా పెడుతున్నట్లు టాక్. ఆ కండీషన్ కు ఒప్పుకోకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేస్తుందట.

శ్రీలీల.. అందం, అభినయం, డ్యాన్స్ ఈ మూడు విషయాల్లో బెస్ట్. ధమాకాలో ఆమె చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడి చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీ మెన్, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నితిన్ తో ఓ మూవీ చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తోంది. ఈ రెండు చిత్రాలు తప్పితే.. మరే సినిమాలు ఆమె చేతుల్లో లేవు. దానికి ఓ బలమైన కారణం ఉంది.

కొత్త సినిమాలను ఒప్పుకునే క్రమంలో ఓ కండీషన్ పెడుతోందట శ్రీలీల. అదేంటంటే? సినిమాలో సోలో హీరోయిన్ అయితేనే ఆ ప్రాజెక్ట్ కు ఒకే చెబుతోందట. లేకుంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేస్తోందట. తాజాగా కార్తీ సర్దార్ 2లో నటించనని సున్నితంగా చెప్పేసిందట ఈ బ్యూటీ. దీంతో పాటుగా ఓ బాలీవుడ్ మూవీని కూడా రిజెక్ట్ చేసిందని టాక్. సోలో హీరోయిన్ అయితేనే చేస్తానని మేకర్స్ కు సరికొత్త కండీషన్ పెట్టిందట ఈ చిన్నది. అందుకే ఈ బ్యూటీ చేతుల్లో మునపటిలా సినిమాలు ఉండటం లేదు. మరి ఈ కండీషన్ తో ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొస్తుందా? అని అభిమానులు, సినీ పండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీలీల కండీషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş