Swetha
ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ తమ అదృష్టం పరీక్షించుకోడానికి వస్తూ ఉంటారు. కానీ చాలా కొంతమంది మాత్రమే ఈ మార్కెట్ లో సర్వైవ్ అవుతూ ఉంటారు. వారిలో శ్రీలీల కూడా ఒకరు. ఈ అమ్మడికి ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.
ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ తమ అదృష్టం పరీక్షించుకోడానికి వస్తూ ఉంటారు. కానీ చాలా కొంతమంది మాత్రమే ఈ మార్కెట్ లో సర్వైవ్ అవుతూ ఉంటారు. వారిలో శ్రీలీల కూడా ఒకరు. ఈ అమ్మడికి ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.
Swetha
ఇండస్ట్రీలో శ్రీలీల ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆమె చేసే సోషల్ సర్వీస్ ల గురించి కూడా అభిమానులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తన మొదటి మూవీ కాస్త అటుఇటుగా టాక్ సంపాదించుకున్నప్పటికీ.. ఆ తర్వాత సినిమాలు మాత్రం దుమ్ము దులిపేసాయని చెప్పి తీరాల్సిందే. గత రెండేళ్లలో ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. దీనితో ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది ఈ అమ్మడు. ప్రెసెంట్ తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’ లో నటిస్తుంది. దానితో పాటు అటు హిందీలో ‘ఆషికి-3’ లాంటి క్రేజీ మూవీలో కూడా నటిస్తుంది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడికి బాలీవుడ్ లో మరోసారి చోటు దక్కనుంది. అది కూడా సిక్వెల్ సినిమాలో ఛాన్స్ రావడం చెప్పుకోదగిన విషయం. కరణ్ జోహార్ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మించబోయే ఆ చిత్రమే.. దోస్తానా-2. జాన్ అబ్రహాం , అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన దోస్తానా మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు దీనికి కంటిన్యుషన్ గా దోస్తానా 2 ను చేయనున్నారు. ఈ పార్ట్ 2 లో కార్తీక్ స్థానంలో విక్రాంత్ మాసే, జాన్వి స్థానంలో శ్రీలీలను ఎంపిక చేసి సినిమాను పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా థియేటర్ లో కాకుండా.. డైరెక్ట్ గా OTT లో రిలీజ్ చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడి అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకున్నట్లు టాక్. అయితే బాలీవుడ్ లో డైరెక్ట్ OTT రిలీజ్ కు ఒప్పుకుని శ్రీలీల రిస్క్ చేస్తుందా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.