iDreamPost
android-app
ios-app

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. పుష్ప 2లో బన్నీతో కలిసి

  • Published Aug 12, 2024 | 12:16 PM Updated Updated Aug 12, 2024 | 12:16 PM

ఈ ఏడాది మోస్ట్ ఎగ్జైటింగ్ చిత్రాల్లో ఒకటి పుష్ప 2. బ్లాక్ బస్టర్ పుష్పకు రీమేక్ అన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీలో స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా జాయిన్ కాబోతుందడట.

ఈ ఏడాది మోస్ట్ ఎగ్జైటింగ్ చిత్రాల్లో ఒకటి పుష్ప 2. బ్లాక్ బస్టర్ పుష్పకు రీమేక్ అన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీలో స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా జాయిన్ కాబోతుందడట.

  • Published Aug 12, 2024 | 12:16 PMUpdated Aug 12, 2024 | 12:16 PM
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. పుష్ప 2లో బన్నీతో కలిసి

పుష్పతో పాన్ ఇండియన్ క్రేజ్‌ను సంపాదించాడు అల్లు అర్జున్. జాతీయ అవార్డును కూడా కొల్లగొట్టాడు.ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి విదితమే. మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు సుక్కు- బన్నీ. అత్యంత భారీ బడ్జెట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకులను పలకరించనుంది. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు డేట్స్ ఫిక్స్ చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ మేర్నేని, యలమంచిలి రవి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 70-80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్స్, సాంగ్స్ దుమ్ముదులిపేస్తున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప-1లో మాదిరి ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు సుకుమార్.

పుష్ప ద రైజ్ మూవీలో స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంతతో స్టెప్పులేయించాడు సుక్కు. ‘ఊ అంటావా మామా ఉఉ అంటావా’ అంటూ బన్నీ-సామ్ జత కడితే యూట్యూబ్ షేక్ అయిపోయింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన కంపోజింగ్ స్టైల్‌కి పిచెక్కిపోయారు ఆడియన్స్. ఇప్పటికీ ఈ పాట వస్తుంటే..హమ్ చేయకుండా, కాలు కదపకుండా ఉండలేరు. ఇప్పుడు అదే రేంజ్‌లో ఐటెం సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మళ్లీ సమంత దగ్గరకే ఈ ఆఫర్ వెళితే ఆమె తిరస్కరించిందన్న చర్చ నడిచింది. అలాగే అప్ కమింగ్ బ్యూటీ, ఒకనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని అనుకున్నారట. చివరకు స్టార్ బ్యూటీ, డాన్స్ క్వీన్ శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఈ సారి మాస్ సాంగ్‌లో శ్రీలీలతో స్టెప్పులు వేయించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

ఇదే నిజమైతే.. ఆ పాటకు వచ్చే హైప్ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇటీవల శ్రీలీల కూడా తన డ్యాన్సులతో గత్తర గత్తర లేపుతున్న సంగతి విదితమే. ఇక ఈ ఇద్దరు కలిసి స్పెషల్ సాంగ్ చేయబోతున్నారంటే ఎలా ఉంటుందో ఇక చెప్పనక్కర్లేదు. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇక ఫ్యాన్స్ అయితే పూనకాలు తెచ్చేసుకోవడమే ఆలస్యం. ఇక టీం ఎనౌన్స్ మెంటే తరువాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, రాబీన్ హుడ్ కాకుండా రవితేజతో ఓ మూవీ చేస్తోంది. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. రూ. 500లతో మూవీని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. ఫహాద్ ఫజిల్, జగదీప్ బండారీ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet