iDreamPost
android-app
ios-app

Sreeleela: జాక్ పాట్ కొట్టిన శ్రీలీల.. బాలీవుడ్ లో భారీ ఆఫర్?

  • Published Aug 15, 2024 | 1:50 PM Updated Updated Aug 15, 2024 | 1:50 PM

టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ లో భారీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ లో భారీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

  • Published Aug 15, 2024 | 1:50 PMUpdated Aug 15, 2024 | 1:50 PM
Sreeleela: జాక్ పాట్ కొట్టిన శ్రీలీల.. బాలీవుడ్ లో భారీ ఆఫర్?

శ్రీలీల.. టాలీవుడ్ లోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘పెళ్లిసందD’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. తన అందం, యాక్టింగ్, డ్యాన్స్ లకు టాలీవుడ్ ఫిదా అయ్యింది. దాంతో మేకర్స్ అంతా ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం వెంటపడ్డారు. దాంతో తొలి సినిమా తర్వాత ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు ఒప్పుకుంది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉండగా.. లేటెస్ట్ గా శ్రీలీల జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఓ భారీ ఆఫర్ ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ లో భారీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా బల్వీందర్ సింగ్ దర్శకత్వంలో ‘మిట్టి’ అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఛాన్స్ కొట్టేసినట్లుగా సమాచారం. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందబోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ వినగానే శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Big offer in Bollywood

కాగా.. మిట్టి మూవీలో హీరోయిన్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందని అందుకే ఈ బ్యూటీ మూవీకి ఓకే చెప్పిందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న మిట్టి మూవీ.. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇక ఇబ్రహీం అలీ ఖాన్ నటిస్తున్న ‘దిలేర్’ మూవీలో ఈ బ్యూటీ నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతున్న ‘రాబిన్ హుడ్’, హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజ 75వ చిత్రంలో కూడా శ్రీలీల నటిస్తోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş