Pawan Kalyan: పవన్ బర్త్ డే.. ఉస్తాద్ కాదు.. OGదే హడావిడి!

Pawan Kalyan, OG Movie, Ustaad Bhagat Singh Movie: పవర్​స్టార్ పవన్ కల్యాణ్ బర్త్​ డే వచ్చేస్తోంది. సెప్టెంబర్​ 1 ఆయన పుట్టిన రోజు. దీంతో పవన్ మూవీస్​కు సంబంధించిన అప్​డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Pawan Kalyan, OG Movie, Ustaad Bhagat Singh Movie: పవర్​స్టార్ పవన్ కల్యాణ్ బర్త్​ డే వచ్చేస్తోంది. సెప్టెంబర్​ 1 ఆయన పుట్టిన రోజు. దీంతో పవన్ మూవీస్​కు సంబంధించిన అప్​డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

పవర్​స్టార్ పవన్ కల్యాణ్​.. ఈ పేరు వింటేనే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఆయన నుంచి కొత్త సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్​కు మూడినట్లే. వసూళ్ల జాతరతో బాక్సాఫీస్​ను షేక్ చేయడం పవన్​కు అలవాటు. అలాంటి ఆయన నుంచి న్యూ రిలీజెస్ కోసం ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్​స్టార్ యాక్ట్ చేస్తున్న ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ మూవీస్ రిలీజ్ కోసం వెయిటింగ్ నడుస్తోంది. వీటి నుంచి వచ్చే అప్​డేట్స్ కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికో గుడ్ న్యూస్. సెప్టెంబర్ 1వ తేదీన పవన్ మూవీస్​కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్​డేట్స్ బయటకు రానున్నాయి. అయితే పుట్టిన రోజు నాడు ఉస్తాద్ కాదు.. ఓజీదే హడావుడి ఉండనుందని తెలుస్తోంది.

సాధారణంగా హీరోల బర్త్ డే నాడు వాళ్లు నటించే మూవీస్ నుంచి పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ లేదా టీజర్స్ రిలీజ్ చేస్తుంటారు. అలాగే పవన్ పుట్టిన రోజైన 1వ తేదీన కూడా ఆయన లేటెస్ట్ మూవీస్ నుంచి అప్​డేట్స్ సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. అయితే వీరమల్లు, ఉస్తాద్ నుంచి కాకుండా ‘ఓజీ’ నుంచి స్పెషల్ అప్​డేట్ ఉండటం ఖాయమని సమాచారం. యంగ్ డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న ఈ ఫిల్మ్ నుంచి ఆల్రెడీ అప్​డేట్​ను కూడా సిద్ధం చేశారట. ఏదో ఒక అప్​డేట్ కాకుండా ఏకంగా పోస్టర్, లిరికల్ సాంగ్, టీజర్.. ఇలా మూడింటినీ రెడీ చేశారని వినిపిస్తోంది. పవన్ దేనికి ఓకే చెబితే దాన్ని బర్త్ డే స్పెషల్​గా రిలీజ్ చేస్తారని సమాచారం.

‘ఓజీ’ నుంచి మూడు అప్​డేట్స్​ను సిద్ధం చేసిన సుజిత్.. ప్రతిదీ బ్లాస్టింగ్ ఎక్స్​పీరియెన్స్​ ఇచ్చేలా ప్లాన్ చేశారట. పవర్​స్టార్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాన్ని ఫ్యాన్స్​ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారట. ‘ఉస్తాద్ భగత్​సింగ్’, ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా బర్త్​ డే నాడు ఏదో ఒక అప్​డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆ ఛాన్స్ లేదని, కేవలం ‘ఓజీ’ నుంచి మాత్రమే ట్రీట్ ఉంటుందని.. పవర్​స్టార్ పుట్టిన రోజుకు సందడి మొత్తం సుజిత్ సినిమాదేనని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే ఓ టీజర్​తో షేక్ చేసిన ‘ఓజీ’.. నెక్స్ట్ అప్​డేట్​తో మూవీపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేయడం ఖాయమని అంటున్నారు. ఇక, పవన్ బర్త్​డే నాడు ఆయన నటించిన బ్లాక్​బస్టర్ ఫిల్మ్ ‘గబ్బర్ సింగ్’ 4కే వెర్షన్ రీరిలీజ్ కానుంది. భారీ ఎత్తున ఈ మూవీ రీరిలీజ్​ను ప్లాన్ చేస్తున్నారు. మరి.. ‘ఓజీ’ నుంచి అప్​డేట్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments