10th క్లాసులోనే మూవీస్‌లోకి.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ మెస్మరేజ్ చేస్తున్న చిన్నారి పదో తరగతిలోనే సినిమా పాఠాలు స్టార్ట్ చేసింది. 16 ఏళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దూసుకెళుతుంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో చెప్పండి చూద్దాం.

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ మెస్మరేజ్ చేస్తున్న చిన్నారి పదో తరగతిలోనే సినిమా పాఠాలు స్టార్ట్ చేసింది. 16 ఏళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దూసుకెళుతుంది. ఇంతకు ఆ చిన్నది ఎవరో చెప్పండి చూద్దాం.

గతం కన్నా ఇప్పుడు సినిమా తీసే తీరు, చూసే తీరు మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మూడు సీన్లు, ఆరు పాట్లకు చెక్ పెట్టేశారు హీరోయిన్స్. అందుకే కెరీర్ స్టార్ట్ చేసిన తొలి నాళ్లలో గ్లామరస్ పాత్రలో మెప్పించినప్పటికీ.. ఆ తర్వాత చూసీగా సినిమాలు ఎంపిక చేసుకుంటూ.. తమ క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉండేటా చూసుకుంటున్నారు. చిన్న సీన్ అయినా.. బలంగా ఉంటే నటించేందుకు వెనకాడటం లేదు. అయితే కొన్ని రోల్స్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటాయి. అవి ఎక్స్ పీరియన్స్ మీద అవలీలగా పోషిస్తుంటారు. కానీ ఈ ఫోటోలో అమ్మాయి పదో తరగతిలోనే హీరోయిన్ అయ్యి.. వయస్సుకు మించిన పాత్ర పోషించి ఔరా అనిపించింది. ఇప్పుడు వరుస అవకాశాలను కొల్లగొడుతుంది.

ఈ ఫోటోలో చిరు నవ్వులు చిందిస్తున్న ఈ బ్యూటీ చదువుకుంటూనే మోడలింగ్ చేసింది. తర్వాత సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఫస్ట్ మూవీతోనే క్రష్ బ్యూటీగా మారిన చిన్నది.. టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్, అటు మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఆమెను తెలుగు ఆడియన్స్ ముద్దుగా ‘బేబమ్మ’ అని పిలుస్తుంటారు. ఇంత హిట్ ఇచ్చాక తెలిసిపోయింది కదా కృతి శెట్టి అని. ఈ అమ్మాయి కూడా చందన సీమ నుండి వచ్చిన మరో గంధపు చెక్క. 2003లో కర్ణాటకలో పుట్టింది కృతి. చిన్నప్పుడే పెంటాక్, లైఫ్ బాయ్, డైరీ మిల్క్ సిల్క్ వంటి యాడ్స్ చేసింది. హృతిక్ రోషన్ సూపర్ 30లో స్టూడెంట్ పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ.

ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఉప్పెన చిత్రానికి హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఈ మూవీతో మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం ఇచ్చాడు. ఉప్పెనలో బేబమ్మ పాత్రలో మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో నానితో శ్యామ్ సింగరాయ్ నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. రామ్ సరసన ద వారియర్ చేసింది. ఇందులో విజిల్ మహాలక్ష్మి పాత్రలో వీజేగా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మాచర్ల నియోజకర వర్గం, ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి, కస్టడీ, తాజాగా వచ్చిన మనమే. అయినప్పటికీ అవకాశాలకు లోటు లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా మారిపోయింది. అజయంటే రాందం మోషనమ్, వా వాతియార్, లవ్ ఇన్స్యురెన్స్ కార్పొరేషన్, జీని వంటి చిత్రాలు చేసింది.

Show comments