iDreamPost
android-app
ios-app

Kumari Aunty: కుమారి ఆంటీని సన్మానించిన సోనూ సూద్‌.. కారణమిదే!

  • Published Jul 05, 2024 | 12:25 PM Updated Updated Jul 05, 2024 | 12:40 PM

Sonu Sood: సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన కుమారి ఆంటీ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి రియల్‌ హీరో సోనూ సూద్‌ వల్ల ఆమె పేరు వార్తల్లో మార్మోగిపోతుంది. ఆ వివరాలు..

Sonu Sood: సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన కుమారి ఆంటీ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి రియల్‌ హీరో సోనూ సూద్‌ వల్ల ఆమె పేరు వార్తల్లో మార్మోగిపోతుంది. ఆ వివరాలు..

  • Published Jul 05, 2024 | 12:25 PMUpdated Jul 05, 2024 | 12:40 PM
Kumari Aunty: కుమారి ఆంటీని సన్మానించిన సోనూ సూద్‌.. కారణమిదే!

కుమారి ఆంటీ.. ఆరు నెలల క్రితం వరకు ఈమె గురించి కేవలం సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారికి మాత్రమే తెలుసు. చాలా మంది యూట్యూబర్స్‌.. ఈమె ఫుడ్‌ స్టాల్‌ దగ్గరకు వెళ్లి వ్లాగ్స్‌, వీడియోలు చేసి పోస్ట్‌ చేయడంతో ఈమెకు ఎక్కడా లేని క్రేజ్‌ పెరిగింది. అలా జనాలు ఆమె స్టాల్‌ వద్దకు క్యూ కట్టేవారు. దాంతో ఏరియాలో రద్దీ ఎక్కవయ్యి.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుండటంతో.. ఈ ఏడాది ప్రారంభంలో పోలీసులు కుమారి ఆంటీ మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.

ఈ సంఘటన తర్వాత కుమారి ఆంటీ క్రేజ్‌ మరింత పెరిగింది. ఆ తర్వాత బుల్లితెర మీద అనేక షోలలో సందడి చేసింది. అంతేకాక ఆమె బిగ్‌బాస్‌ సీజన్‌ 8 కంటెస్టెంట్‌గా సెలక్ట్‌ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ అలా ఉంచితే తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రియల్‌ హీరో సోనూ సూద్‌ కుమారి ఆంటీని సన్మానించారు. ఆ వివరాలు..

కరోనా సమయంలో ఎందరికో సాయం చేస్తూ.. మంచి మనసు చాటుకుని.. రియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సోనూ సూద్‌. నేటికి ఎందరో సోషల్‌ మీడియా వేదికగా ఆయనని సాయం కోరుతుంటారు. ఈ క్రమంలో తాజాగా సోనూసూద్‌ హైదరాబాద్‌ వచ్చారు. రీసెంట్‌గా ఆయన హీరోగా ఫతే అనే మూవీ తెరకెక్కింది. త్వరలోనే ఇది విడుదల కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన సోనూసూద్‌.. కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ వద్దకు వచ్చాడు. ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని చెప్పుకొచ్చాడు. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుని.. నిజమైన ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు నిదర్శనంగా నిలిచారని ప్రశంసించాడు సోనూ సూద్‌.

కుటుంబ పోషణ కోసం మహిళలు ఎంత కష్టపడుతుంటారో వర్ణించడానికి కుమారి ఆంటీ జీవితము ఉదాహరణ అన్నాడు సోనూ సూద్‌. ఎవరి కుటుంబాలైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళు కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలని.. ఇబ్బందులకు భయపడకుండా.. కష్టమైనా సరే.. సరైన మార్గాన్ని ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అని కుమారి ఆంటీ నిరూపించిందదన్నాడు. అంతేకాక తాను వెజిటేరియన్ అని ఆ మీల్స్‌ ప్లేట్ ఎంత అని అడిగితే కుమారి ఆంటీ 80 రూపాయలు అని చెప్పింది.

అయితే తనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు అని సోనూసూద్‌ ప్రశ్నించగా.. అందుకు కుమారి ఆంటీ మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పుకొచ్చింది. అయితే నాకు లాటరీ తగిలింది ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని సోనూసూద్ అంటే మీరు ఎంతోమందికి సాయం చేశారు మీకు మేము ఎంత పెట్టినా తక్కువే అంటూ చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. ఇక ఈ సందర్భంగా కుమారి ఆంటీని సోనూసూద్‌ సత్కరించాడు. తర్వాత కుమారి ఆంటీ కుమార్తె యామిని, కుమారుడు ధనుష్‌తో కలిసి ఫోటోలు దిగాడు.

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş