iDreamPost
android-app
ios-app

అరియానా కొత్త లుక్ పై దారుణమైన ట్రోలింగ్! కారణం..?

  • Author ajaykrishna Updated - 12:04 PM, Tue - 25 July 23
  • Author ajaykrishna Updated - 12:04 PM, Tue - 25 July 23
అరియానా కొత్త లుక్ పై దారుణమైన ట్రోలింగ్! కారణం..?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ప్రతీ విషయాన్నీ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ముఖ్యమైన విషయాలైతే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారేమో గానీ.. వాళ్లకు అనవసరం అనిపించే విషయాలను ఖచ్చితంగా తిప్పికొడతారు. అవసరం అనిపిస్తే.. కాసేపు అభిమానాన్ని పక్కన పెట్టి ట్రోల్స్ కూడా చేస్తుంటారు. అయితే.. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న వారిలో యాంకర్ అరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ లో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తూ.. బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. అక్కడినుండి ఆమెకు వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు.

అరియానా ముందునుండి తనని తాను బోల్డ్ బ్యూటీగా ప్రెజెంట్ చేసుకునే ప్రయత్నాలు చేసింది. ఆమె ప్రయత్నాలు ఫలించి జనాలు కూడా ఆమెను బోల్డ్ బ్యూటీగా యాక్సెప్ట్ చేశారు. అయితే.. బిగ్ బాస్ లోనే బోల్డ్ అనుకుంటే.. బయటికి వచ్చాక టీవీ ప్రోగ్రాంస్ లో.. సోషల్ మీడియా పోస్టులలో అరియానా రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఆ మధ్య ఓ టీవీ ప్రోగ్రాంలో వాన పాటకు నెక్స్ట్ లెవెల్ లో గ్లామర్ షో చేసింది. అక్కడినుండి మళ్లీ బిబి జోడి.. ఇలా తనకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రదర్శిస్తూ దూసుకుపోతుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో కూడా మిలియన్స్ కొద్దీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. అరియానా సోషల్ మీడియాలో పెట్టిన కొత్త ఫోటోలు ట్రోల్స్ కి గురవుతున్నాయి.

అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే.. ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ కి పైగా ఫాలోయింగ్ కలిగిన అరియానా.. తాజాగా మెహబూబ్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లి.. థైస్ కనిపించేలా కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఆమె అందాన్ని ఆస్వాదించేవారు ఓవైపు.. అదేంటి మొన్నటిదాకా సన్నగా ఉన్న అరియానా ఇలా గుర్తు పట్టలేని విధంగా లావుగా మారిందేంటి? అని ట్రోల్ చేసేవారు మరోవైపు అయిపోయారు. ఈ మధ్య నిజంగానే అరియానా బొద్దుగా తయారైంది. దీంతో పాత లుక్ తో కొత్త లుక్ పోల్చుతూ.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లోనే బాగున్నావ్.. ఇప్పుడు ఎందుకు లావు అయ్యావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అరియానా తన విదేశీ టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. మరి వచ్చాక ఈ ట్రోల్స్ పై ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. మరి అరియానా కొత్త లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş