Nagendra Kumar
Telanagana Elections & Social Media Influencers: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం ఎవరిని సీఎం చేయాలి అని అధిష్టానం మంతనాలు చేస్తోంది. ఈ గ్యాప్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కు కొత్త తలనొప్పి మొదలైంది.
Telanagana Elections & Social Media Influencers: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం ఎవరిని సీఎం చేయాలి అని అధిష్టానం మంతనాలు చేస్తోంది. ఈ గ్యాప్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కు కొత్త తలనొప్పి మొదలైంది.
Nagendra Kumar
తెలంగాణ ఎలక్షన్స్ ఫలితాలు దిమ్మతిరిగిపోయే షాకిచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ విషయంలో ఇది చాలా గట్టి ప్రభావం చూపిస్తోందేమోనన్న భయం వాళ్ళని తీవ్రంగా వెంటాడుతోంది. సాధారణంగా ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసిన దగ్గర్నుంచీ సినిమా యాక్టర్లు కూడా ముమ్మరంగా రాజకీయాలలోకి రావడం, ఎన్నికల క్యాంపైనింగ్ లో ప్రచారాలు చేయడం అన్నది పరిపాటిగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీతో గట్టి అనుబంధాన్ని పంచుకున్న స్నేహబంధాలు రాజకీయరంగానికి ప్రచారవేళల్లో బాగా కలిసొచ్చేవి. మంచి గ్లామర్ ఉన్న నటీనటులను రంగంలోకి దించి లేదా పార్టీ సీట్లు కట్టబెట్టి.. పార్టీ గ్లామర్ పెంచుకునే తాపత్రయం ప్రతీ పార్టీకి సర్వసహజంగా రివాజై పోయింది.
ఇటీవలి రోజులలో అది కాస్త ముందుకు వెళ్ళి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సోషల్ మీడియా ఎప్పుడైతే వేళ్ళూనుకుందో, ఇన్ఫ్లుయన్సర్స్ డిమాండ్ అన్ని విధాలా మిన్ను ముట్టిందనే చెప్పాలి. అదొక్క కోణంలో కాదు. దేనికి విశాలమైన ప్రచారం కావాల్సినా.. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ని అందరూ ఆశ్రయించడం మొదలు పెట్టారు. నటీనటులు మాత్రం రాజకీయ సమీకరణాలను బాగా వంట బట్టించుకుని ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాస్తంత దూరంగానే ఉన్నారు. దేని మీద కామెంట్ చెయ్యడానికి కూడా ముందకు రాలేదు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఈ అవకాశాన్ని సువర్ణావకాశంగా భావించి, పెద్ద మొత్తాలకే బీఆర్ఎస్ పార్టీ నిమిత్తమై ప్రచారాల రథమెక్కారు. చిన్నచిన్న ఇన్ఫ్లుయన్సర్స్ కూడా తెగ బిజీ అయిపోయారు.
అందులో భాగంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ లకు సంబంధించి వారి పథకాలు, వారి భవిష్య కార్యాచరణ వంటి వాటి మీద వీడియోల మీద వీడియోలు గుప్పించేశారు. కేటీఆర్ ప్రమేయంతో ఈ ఇన్ఫ్లుయన్సర్స్ బాగా యాక్టివ్ అయిపోయి సోషల్ మీడియాని ఊపేశారు. అందులో ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ లో బాగా పేరుపడ్డ సెలబ్రిటీ అషూరెడ్డి. ఈమె వీడియోలే బాగా వైరల్ అయ్యాయి ఇన్ స్టాగ్రామ్ లో. కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే షాకింగ్ విన్ కొట్టిందో, అషురెడ్డి లాటి వాళ్ళు, ముఖ్యంగా అషూరెడ్డి వీడియోలు క్షణాల్లో మటుమాయమయ్యాయి. ఒక్కటే భయం… బీఆర్ఎస్ కి ప్రచారం చేశారని విజేత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కక్షకట్టి పీడిస్తారోననే భయం పీడకలలా వెంటాడుతోంది. పోనీ, ప్రమోషనల్ వీడియోలుగా కూడా అవి ప్రచారంలోకి రాలేదు. కేసీఆర్, కేటీఆర్ ల పట్ల తిరుగులేని కమిట్మెంట్, అంకితభావం తొణికిసలాడుతూ ఆ వీడియోలు ప్రాచుర్యం పొందడంతో అషూరెడ్డిలాటి వాళ్ళకి ఇప్పుడు గుండెల్లో దడ మొదలైంది.