iDreamPost
android-app
ios-app

ఆవేశంగా రివ్యూస్ ఇచ్చే యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ ఇక లేరు

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్యుయెన్సర్ యాంగ్రీ ర్యాంట్ మాన్ ఇటీవల ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. మల్టీపుల్ ఆర్గానిక్ ఫెయిల్యూర్ కావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన..

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్యుయెన్సర్ యాంగ్రీ ర్యాంట్ మాన్ ఇటీవల ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. మల్టీపుల్ ఆర్గానిక్ ఫెయిల్యూర్ కావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన..

ఆవేశంగా రివ్యూస్ ఇచ్చే యాంగ్రీ ర్యాంట్ మ్యాన్ ఇక లేరు

సోషల్ మీడియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి యాంగ్రీ ర్యాంట్ మాన్. కోపంగా, ఫన్నీగా వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి అసలు పేరు అబ్రదీప్ సాహా. ఆవేశంగా, కోపంగా వీడియోలు చేస్తుంటారు. దీంతో యాంగ్రీ ర్యాంట్ మాన్‌గా పేరు సంపాదించాడు. సోషల్ మీడియాను నిత్యం ఫాలో అయ్యేవారు.. ఇతడి గురించి తెలియకుండా ఉండరు. యూట్యూబ్‌లో ఆయనకు 4 లక్షలకు మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. కొత్త కొత్త సినిమాలు చూసి వాటికి ఆవేశంగా రివ్యూస్ ఇస్తుంటాడు. ఇతడి వీడియోలు చాలా ఫన్నీ తెప్పించడమే కాదూ.. ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు అబ్రదీప్.

మల్టీపుల్ ఆర్గానిక్ ఫెయిల్యూర్ కావడంతో ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ ఈ నెల 16న  మరణించాడు. గత రాత్రి ఆయన మరణించాడంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాజ్4ఎస్ఎస్ఆర్ అనే నెటిజన్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ర్యాంట్ మ్యాన్ పదోతరగతి స్నేహితుడు అతడికి ఈ సందేశాన్ని చెప్పినట్లు పేర్కొన్నాడు. కాగా, ర్యాంట్ మ్యాన్‌గా ముద్ర పడ్డ అబ్రదీప్ మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు నెటిజన్లు. అతడి చెప్పే రివ్యూస్ తమకు ఎంతో ఇష్టమని గుర్తు చేసుకుంటూ త్వరగా వెళ్లిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో మందిని తన రివ్యూస్‌తో మెప్పించిన ఇన్ఫ్యుయెన్సర్ ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడని తెలిసి బాధపడుతున్నారు

అతడు కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు.. ఇన్ స్టా వేదికగా కూడా పలు అంశాలపై తన ఆవేశాన్ని వెల్లగక్కుతూ ఉంటాడు. ఇన్ స్టాలో కూడా ఆయనకు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నవ్వుతూ, కోపంగా, ఆవేశంగా, చెమటలు పట్టే విధంగా అన్ని సామాజిక అంశాలపై స్పందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్యుయెన్సర్ ఇక లేరని తెలిసే సరికి ఆయన ఫాలోవర్స్, నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయన చివరి సారిగా సైతాన్ మూవీకి రివ్యూ ఇచ్చారు. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక కీలక పాత్రల్లో నటించిన ఈ బాలీవుడ్ మూవీ పట్ల చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.