iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 28.. సినిమాలున్నాయ్! పరిస్థితులు మారిపోతున్నాయ్!

  • Author ajaykrishna Published - 12:09 PM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 12:09 PM, Sun - 17 September 23
సెప్టెంబర్ 28.. సినిమాలున్నాయ్! పరిస్థితులు మారిపోతున్నాయ్!

సెప్టెంబర్ 28.. పాన్ ఇండియా రిలీజ్ లకు మంచి అవకాశం అని అంతా భావించారు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ.. ఆ డేట్ కి రావాల్సింది. కానీ.. అనూహ్యంగా సినిమాని ఆ డేట్ నుండి వాయిదా వేసేసారు మేకర్స్. దీంతో సలార్ డేట్ ని క్యాష్ చేసుకునేందుకు.. సెప్టెంబర్ 15ని టార్గెట్ చేసుకున్న స్కంద, చంద్రముఖి 2 సినిమాలు రెడీ అయ్యాయి. ఆఖరికి సెప్టెంబర్ 28నే వస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది. డేట్ అయితే లాక్ చేసుకున్నాయి గానీ.. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలలో, ఆడియన్స్ లో బజ్ అయితే కనిపించడం లేదు.

రిలీజ్ కి ఇంకా పదిరోజులు టైమ్ ఉంది. ఇప్పటిదాకా సినిమాల నుండి ప్రాపర్ ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదు. సరే చంద్రముఖి 2 అంటే డబ్బింగ్ సినిమా కాబట్టి.. దానికి ఉండాల్సిన బజ్ కొంచమే ఉంటుంది. ఎందుకంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చంద్రముఖికి ఇది సీక్వెల్. కానీ.. ఇందులో రజినీకాంత్ లేడు. ఆయన ప్లేస్ లో లారెన్స్ వచ్చాడు. పైగా లారెన్స్ లుక్, ట్రైలర్ పెద్దగా ఆసక్తి క్రియేట్ చేయలేకపోయాయి. పైగా పాన్ ఇండియా రిలీజ్ అన్నారు. మరోవైపు రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో స్కంద వస్తుంది. ట్రైలర్ చూస్తే.. రామ్ ని పూర్తిగా మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు బోయపాటి.

అలాగని ట్రైలర్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ ఏమోగానీ.. మిక్సడ్ రియాక్షన్ అయితే వచ్చింది. రామ్ పక్కన శ్రీలీల ఉండటం ఓ అట్రాక్టింగ్ పాయింట్. తమన్ సాంగ్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే.. స్కంద కూడా పాన్ ఇండియా రిలీజ్ అన్నారు. కానీ.. ఇప్పటిదాకా మూవీ టీమ్ ఎక్కడ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్లు కనిపించడం లేదు. మరో విషయం ఏంటంటే.. సెప్టెంబర్ 28 అనేది పాన్ ఇండియా రిలీజ్ లకు కలిసి రాకపోవచ్చని టాక్ నడుస్తుంది. ఎందుకంటే.. సెప్టెంబర్ ఎండింగ్ లో వినాయకుడి నిమజ్జనం దేశవ్యాప్తంగా జరగనున్నాయి. సో.. జనాల ఫోకస్ అంతా సినిమాలకంటే వినాయకుడిపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ రెండు పాన్ ఇండియా రిలీజ్ లకు పరిస్థితులు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి స్కంద, చంద్రముఖి2 రిలీజ్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet