iDreamPost
android-app
ios-app

సాలిడ్ వీకెండ్ ని వదులుకున్న క్రేజీ మూవీస్!

  • Author ajaykrishna Published - 08:03 AM, Sat - 9 September 23
  • Author ajaykrishna Published - 08:03 AM, Sat - 9 September 23
సాలిడ్ వీకెండ్ ని వదులుకున్న క్రేజీ మూవీస్!

ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా థియేట్రికల్ గా వీకెండ్స్ బాగా క్యాచ్ చేసుకోవాలని చూస్తుంటాయి. పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే.. మీడియం రేంజ్ సినిమాలు మాత్రం అవకాశం కోసం కాచుకొని కూర్చుంటాయి. పెద్ద సినిమాలు లేని వీకెండ్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ ప్లాన్ చేస్తాయి. అయితే.. నెలలో రెండు వీకెండ్స్ డేట్స్ దొరికినప్పుడు ఒక్కో వీకెండ్ ని క్యాచ్ చేసుకుంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. కానీ.. ముందుగా సపరేట్ వీకెండ్స్ ని టార్గెట్ చేసిన సినిమాలు.. వాయిదా పడి ఒకేసారి పోటీగా రిలీజ్ అవ్వడం అనేది ముందుగా డేట్ లాక్ చేసుకున్న సినిమాలకు ఇబ్బంది అనే చెప్పాలి.

ఇంతకీ ఏ సినిమాల గురించి చెబుతున్నారు? అనంటే రామ్ పోతినేని స్కంద, రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 సినిమాల గురించి. సెప్టెంబర్ 28న రావాల్సిన సలార్ మూవీ వాయిదా పడటంతో.. ఆ డేట్ అన్ని సినిమాలకు హాట్ కేక్ అయిపోయింది. ఎందుకంటే.. వీకెండ్ లో నాలుగు రోజులు కలిసి వస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 15న రిలీజ్ ప్రకటించిన స్కంద మూవీ.. ఒక్కసారిగా 28కి షిఫ్ట్ అయ్యింది. దానితో పాటు కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్, సితార ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్, శ్రీకాంత్ అడ్డాల పెదకాపు.. సెప్టెంబర్ 28, 29 డేట్స్ లాక్ చేసుకున్నాయి. సరే ఉన్నవాటిలో స్కంద ఒకటే పెద్ద సినిమాగా కనిపిస్తుంది. రూల్స్ రంజన్, మ్యాడ్ సినిమాలు సర్దుకుంటాయిలే అనుకున్నారు.

కట్ చేస్తే.. సెప్టెంబర్ 15న రిలీజ్ అవ్వాల్సిన చంద్రముఖి 2.. ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్ సంతృప్తి కరంగా లేదని వాయిదా పడింది. అదికూడా సెప్టెంబర్ 28కి వాయిదా పడి స్కంద పక్కన చేరింది.నిజానికి సెప్టెంబర్ 15న స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు. పైగా విశాల్ మార్క్ ఆంటోనీ ఉన్నప్పటికీ.. అది కాస్త మద్రాస్ హైకోర్టు కేసులో చిక్కుకుంది. సో.. అది రిలీజ్ అవుతుందా లేదా తెలియదు. కానీ.. సెప్టెంబర్ 15 వీకెండ్ ని స్కంద, చంద్రముఖి సినిమాలు వేస్ట్ చేసుకున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. సెప్టెంబర్ 28 టైంలో గణపతి నిమర్జనాలు జరుగుతాయి. ఆ టైమ్ లో ప్రేక్షకులు గణపతి నిమర్జనంపై పెట్టిన ఫోకస్.. సినిమాలపై పెడతారో లేదో చూడాలి. ఒక రకంగా సెప్టెంబర్ రెండో వీకెండ్ మాత్రం వేస్ట్ అవుతోందని టాక్. మరి స్కంద, చంద్రముఖి 2 మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom