iDreamPost
android-app
ios-app

ఇంటరెస్టింగ్ గా SK అయలాన్ టీజర్! ఏలియన్ కి భూమ్మీద పనేంటి?

  • Author ajaykrishna Updated - 09:42 AM, Sat - 7 October 23
  • Author ajaykrishna Updated - 09:42 AM, Sat - 7 October 23
ఇంటరెస్టింగ్ గా SK అయలాన్ టీజర్! ఏలియన్ కి భూమ్మీద పనేంటి?

డబ్బింగ్ సినిమాలతో వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో శివకార్తికేయన్. పేరుకు తమిళ హీరో అయినట్లే గానీ.. ఇతనికి తెలుగులోను సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెమో, డాక్టర్, డాన్, మహావీరుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో శివ కార్తికేయన్.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. అతను చేసే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ఎంచుకునే సబ్జెక్టులు మాత్రం ఖచ్చితంగా హ్యాట్సాఫ్ అనిపిస్తుంటాయి. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన SK.. ఒక టీవీ యాంకర్ గా కెరీర్ ఆరంభించి.. ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడంటే మామూలు విషయం కాదు.

మహావీరుడు లాంటి సూపర్ హిట్ తర్వాత.. శివ నుండి వస్తున్న కొత్త సినిమా ‘అయలాన్’. దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి అయలాన్ తమిళంతో పాటు తెలుగు భాషలో రిలీజ్ అవుతోంది. కాగా.. తాజాగా అయలాన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ సింపుల్ గా ఉన్నప్పటికీ.. చాలా ఆసక్తి రేపుతోంది. అందుకు కారణం.. సినిమాలో ఏలియన్(గ్రహాంతర వాసి) ఎంట్రీ. టీజర్ లో గమనిస్తే.. కథ పరంగా ఓ పల్లెటూరిలో ఉండే హీరో.. ఈ భూమ్మీదకు ఏదో ప్రమాదం రాబోతుందని సైంటిస్ట్ లు.. కట్ చేస్తే.. హీరో ఉన్న ఏరియాలో ఏలియన్ దిగుతుంది.

భాష రాకపోయినా హీరో గ్యాంగ్ ఆ ఏలియన్ ని దగ్గర తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఏలియన్ ఎందుకు వచ్చింది? అనేది మిగతా కథగా అనిపిస్తుంది. కానీ.. దర్శకుడు వేరే ఏమైనా స్పెషల్ పాయింట్స్ దాచాడు కావచ్చు. పైగా ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే.. పక్కాగా సబ్జెక్టు అంత ఈజీగా ఓకే చేయడు. సో.. అయలాన్ టీజర్ పరంగా సినిమాపై చాలా ఇంటరెస్ట్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. అవును.. ఇదివరకు ఇండస్ట్రీలో ఏలియన్, రోబో టైప్ ఛాయలు కనిపిస్తున్నాయి. అయినా.. ఫన్ తో పాటు ఇంటరెస్ట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సో.. అయలాన్.. SK సబ్జెక్టులలో మరో బెస్ట్ చాప్టర్ కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు నీరవ్ షా కెమెరా వర్క్ అదిరింది. మరి అయలాన్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

marsbahis girişjojobet girişjojobet