iDreamPost
android-app
ios-app

రాడిసన్‌ డ్రగ్‌ కేసులో ట్విస్ట్‌.. తన చెల్లి కనిపించడం లేదంటూ సినీ నటి కుషిత ఫిర్యాదు

  • Published Feb 29, 2024 | 1:56 PM Updated Updated Feb 29, 2024 | 1:56 PM

ఇటీవలే డ్రాగ్స్ కేసులో పట్టబడిన హీరోయిన్ కుషిత చెల్లెలు లిషిత కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈసారి ఏకంగా అక్క కుషిత చెల్లెలు లిషిత పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారణం తెలిస్తే షాక్ అవుతారు.

ఇటీవలే డ్రాగ్స్ కేసులో పట్టబడిన హీరోయిన్ కుషిత చెల్లెలు లిషిత కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈసారి ఏకంగా అక్క కుషిత చెల్లెలు లిషిత పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారణం తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Feb 29, 2024 | 1:56 PMUpdated Feb 29, 2024 | 1:56 PM
రాడిసన్‌ డ్రగ్‌ కేసులో ట్విస్ట్‌.. తన చెల్లి కనిపించడం లేదంటూ సినీ నటి కుషిత ఫిర్యాదు

హైదరాబాద్ మహా నగరంలో ఈ మధ్య డ్రగ్స్ కు సంబంధించిన కేసులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ వలలో అటూ సామాన్యులతో పాటు సెలబ్రీటి కూడా తరుచు వార్తలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు సెలబ్రీటిస్ పేర్లు ఈ డ్రగ్స్ కేసులో విచారణకు కూడా హాజరయిన సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఈ డ్రగ్స్ కేసులో చేరింది. అయితే ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ కుషిత చెల్లెలు లిషిత ఇటీవలే డ్రగ్స్ రైడ్స్ లో పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఏకంగా ఈసారి అక్క కుషిత చెల్లెలు లిషిత పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టాలీవుడ్ హీరోయిన్ కుషిత చెల్లెలు లిషిత తాజాగా డ్రగ్స్ కేసులో.. గబ్బిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన దాడుల్లో శేరిలింగపల్లి బీజెపీ నేత కుమారుడు పట్టుబడ్డిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ డ్రగ్స్ కేసులో పట్టబడిన లిషిత కనపడేటం లేదు అంటూ.. గచ్చిబౌలీ పోలీసులకు అక్క హీరోయిన్ కుషిత ఫిర్యాదు చేసింది. కాగా, డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుంచి తన చెల్లెలు కనపడటం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కోంది. ఇప్పటికే లిషిత ఇంటికి నోటీసులు పోలీసులు పంపించారు. మరోవైపు లిషిత కావాలనే ఈ విచారణకు హాజరు కావడం లేదని పోలీసులు అంటున్నారు. అలాగే ఈ కేసు విచారణకు కచ్చితంగా రావలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు.

కాగా,గత రెండేళ్ల క్రితం హైదరాబాద్ రాడిసన్ హోటల్లో ఉన్న పబ్ లో ఈ డ్రగ్స్ సోదాలు జరగగా.. పలువురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పిల్లలు,వీఐపీ పిల్లల పేర్లు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. అయితే ఆ కేసులో ఇప్పటికీ కొందరిని పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. అదే సమయంలో నటి కుషిత కళ్లపు మీద కూడా అప్పటిలో డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కానీ, అప్పుడు తాము కేవలం చీజ్ బజ్జిలు తినడానికి మాత్రమే వెళ్లామని.. డ్రగ్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. దీంతో అప్పట్లో కుషిత మాటలపై తెగ ట్రోల్స్ జరిగాయి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తు నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.

అయితే మరోవైపు రాడిసన్ డ్రగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఏ10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ అందుబాటులో లేడని.. అతడు పరారీలో ఉన్నాడంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆయన మీద సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. రాడిసన్ హోటల్ కు వెళ్లానని.. ఆ రోజు అక్కడే ఉన్నానని.. కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని క్రిష్ చెప్పినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. మరి, హీరోయిన్ కుషిత చెల్లెలు లిషిత కేసులో ఈ కొత్త ట్విస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/