iDreamPost
android-app
ios-app

10 రోజులు థియేటర్లు బంద్! ఎందుకంటే?

  • Published May 15, 2024 | 11:15 AM Updated Updated May 15, 2024 | 11:36 AM

Single Screen Theatres: ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు.. మరోవైపు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. దీంతో థియేటర్లకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Single Screen Theatres: ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు.. మరోవైపు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. దీంతో థియేటర్లకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  • Published May 15, 2024 | 11:15 AMUpdated May 15, 2024 | 11:36 AM
10 రోజులు థియేటర్లు బంద్! ఎందుకంటే?

సాధారణంగా వేసవి కాలంలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇటీవల పెద్ద హీరోల సినిమాలు అన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి,ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోల మూవీస్ షూటింగ్ షరవేగంగా జరుగుతున్నాయి. చిన్న హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తున్నా కలెక్షన్ల పరంగా ఒకటీ రెండు తప్ప ఏవీ పెద్దగా సాధించలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ రాజ్యమేలుతుంది. కొంతమంది నిర్మాతలు తమ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐపీఎల్ సీజన్ 2024 నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం ఎండలు మండి పోతున్నాయి. జనాలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. ఏప్రిల్ నుంచి భానుడు ప్రతాపం మొదలై మే నెలలో తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడి వాతావరణం చల్లబడినా.. మళ్లీ ఎండలు దంచేస్తున్నాయి. సాధారణంగా ఎండకాలం వచ్చిందంటే విద్యార్థులకు సెలవులు ఉంటాయి. ఫ్యామిలీతో కొత్త సినిమాలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సినీ ప్రేమికులకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఊహించని షాక్ అందించాయి.

మునుపెన్నడూ లేని విధంగా కొత్త సినిమాలు ఏవీ లేకపోవడం.. మరోవైపు ఐపీఎల్, ఎలక్షన్స్ ఎఫెక్ట్ కారణంగా థియేటర్లలో ప్రేక్షకులు భారీ సంఖ్యలో తగ్గిపోయారు. దీంతో థియేటర్ల బోసిగా మారడంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నిర్వహణ వ్యయాలు కూడా రావడం లేదని.. ఐపీఎల్ పూర్తయి పరిస్థితులు మొత్తం సాధారణ స్థితికి చేరుకునే వరకు అంటే పదిరోజుల వరకు సింగిల్ స్క్రీన్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by Aakashavaani (@theaakashavaani)