iDreamPost
android-app
ios-app

Singer Sunitha: సింగర్ సునీత ఎమోషనల్.. కుమారుడి సక్సెస్ గురించి చెప్తూ..

  • Published Jan 06, 2024 | 8:56 PM Updated Updated Jan 06, 2024 | 8:56 PM

సింగర్ సునీత ఎమోషనల్ అయ్యారు. కుమారుడి విజయం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సింగర్ సునీత ఎమోషనల్ అయ్యారు. కుమారుడి విజయం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

  • Published Jan 06, 2024 | 8:56 PMUpdated Jan 06, 2024 | 8:56 PM
Singer Sunitha: సింగర్ సునీత ఎమోషనల్.. కుమారుడి సక్సెస్ గురించి చెప్తూ..

సింగర్ సునీత గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ పేరు చెప్పగానే ప్రేక్షకులు అంతా ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో అంటూ మైమరచిపోతూ ఉంటారు. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ సింగర్ ఇప్పుడు తన కుమారుడి సక్సెస్ చూసి ఎమోషనల్ అయ్యారు. కొడుకు గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు. ఆకాశ్ విజయం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఏ తల్లైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ప్రస్తుతం సింగర్ సునీత ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతను ప్రధాన పాత్రలో నటించిన సర్కారు నౌకరీ సినిమా జనవరి 1న విడుదలైంది. ఈ మూవీలో ఆకాశ్ సరసన భావన హీరోయిన్ గా నటించింది. ఒక మంచి సందేశనాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీ చూసిన తర్వాత సింగర్ సునీత భావోద్వేగానికి లోనయ్యారు. ఆకాశ్ గురించి మాట్లాడుతూ “ఎడిట్ సూట్ లో నేను ఈ సినిమా చూశాను. ఇప్పుడు థియేటర్లలో చూసిన తర్వాత నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆకాశ్ ఎప్పుడూ యాక్టింగ్ చేస్తాను యాక్టింగ్ చేస్తాను అంటే ఏమో అనుకున్నాను. రాఘవేంద్రరావు గారికి, శేఖర్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. రాఘవేంద్రరావు ఒక బలమైన కథను ఎంచుకున్నారు. దానిని శేఖర్ ఎంతో చక్కగా తెరకెక్కించారు. నాకు కళ్లతో భావాలను పలికించే నటులంటే చాలా ఇష్టం. నాకు ఈ సినిమాలో నేను రోజూ ఇంట్లో చూసే నా కుమారుడు కనిపించలేదు. నాకు ఆ గోపాల్ పాత్రే కనిపించింది.

ఈ మూవీ ఎమోషనల్ గా ఉందని మాత్రమే నాకు కన్నీళ్లు రావట్లేదు.. నా పిల్లలు వాళ్లు అనుకున్నది సాధించడం చూసి ఒక తల్లిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకి సాంగ్స్, మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న అందరు నటీనటులు ఎంతో బాగా నటించారు. కొన్ని సినిమాలు నవ్విస్తే.. మరికొన్ని గుండెను బరువెక్కిస్తాయి. ఈ చిత్రంలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అందరూ ఎంతో న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఇలాంటి మూవీలో ఆకాశ్ నటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అంటూ సింగర్ సునీత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సింగర్ సునీత మాటలు విన్న నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ మాటల్లోనే సినిమా సక్సెస్ అయ్యిందని అర్థమవుతోందని చెబుతున్నారు. ఒక తల్లిగా పిల్లల సక్సెస్ ను ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కుమారుడి సక్సెస్ విషయంలో సింగర్ సునీత ఎమోషనల్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Singer_Sunitha_Official (@singer_sunitha_official)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş