P Venkatesh
Singer palak muchhal: సింగర్ గొప్ప మనసు చాటుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3 వేల మందికి ఆపరేషన్స్ చేయించింది. మరింత మంది చిన్నారులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది.
Singer palak muchhal: సింగర్ గొప్ప మనసు చాటుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3 వేల మందికి ఆపరేషన్స్ చేయించింది. మరింత మంది చిన్నారులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది.
P Venkatesh
జన్యుపరమైన కారణాలు, అనారోగ్యాల కారణంగా గుండె జబ్బుల భారిన పడుతుంటారు. పెద్ద వారిలోనే కాదు చిన్న పిల్లల్లో కూడా హార్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొందరికి పుట్టుకతోనే గుండె సమస్యలు తలెత్తితే మరికొంత మందికి ఎదుగుతున్న క్రమంలో హార్ట్ కు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. హార్ట్ సర్జరీలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పేదలకు ఇది మరింత భారంగా ఉంటుంది. చికిత్సకు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. ఇలా గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను నిలిపేందుకు ఓ సింగర్ తన గొప్ప మనసును చాటుకుంది. 3 వేలమందికి హార్ట్ సర్జరీలు చేయించి ప్రాణాలు నిలిపింది. ఆమె మరెవరో కాదు సింగర్ పాలక్ ముచ్చల్.
చిన్నారుల పాలిట దైవంలా మారింది ఓ సింగర్. చిన్నారుల గుండె ఆగిపోకుండా సొంతంగా చికిత్స చేయిస్తున్నారు సింగర్ పాలక్ ముచ్చల్. ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది నిరుపేద చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. తన పాటలు ప్రాచూర్యం పొందడంతో ఆదాయం పెరిగిందని, ఒక్క కాన్సార్ట్ తో 13-14 ఆపరేషన్లకు సరిపడా నిధులను సేకరిస్తానని ఆమె వెల్లడించారు. ఇంకా 400 కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లో ఉన్నారని తెలిపింది. తన సంపాదన వారికోసమేనని పాలక్ ముచ్చల్ చెబుతున్నారు. చిన్నారుల ప్రాణాలు నిలపడంలోనే తనకు అసలైన ఆనందమున్నదని ఆమె తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన గాయకురాలు పాలక్ ముచ్చల్. ఈమె చిన్న తనం నుంచే సేవాకార్యాక్రమాలను అవర్చుకుంది. గుండె జబ్బుల బారినపడిన చిన్నారులకు చికిత్స కోసం ఆర్థిక సాయం అందించేందుకు నిధులు సేకరించడానికి భారత్ తో పాటు విదేశాల్లో కూడా స్టేజ్ షోలను ఇస్తుంటారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నేపథ్య గాయకురాలిగా ప్రదర్శన ఇచ్చారు. ఏక్ థా టైగర్, ఆషికి 2, కిక్, యాక్షన్ జాక్సన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, కాబిల్ వంటి హిందీ చిత్రాలలో ఆమె తన గాత్రాన్ని అందించింది. ఆమె పాడిన పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సింగర్ పాలక్ ముచ్చల్ పై సినీ ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించారు.