iDreamPost
android-app
ios-app

ప్రముఖ సింగర్ మనో కుమారులపై పోలీసు కేసు నమోదు

  • Published Sep 12, 2024 | 10:58 AM Updated Updated Sep 12, 2024 | 11:00 AM

Singer Mano: ప్రముఖ సింగర్ మనోకి ఆయన కుమారులు బిగ్ షాక్ ను ఇచ్చారు. ఈయన కుమారులపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ, మనో ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Singer Mano: ప్రముఖ సింగర్ మనోకి ఆయన కుమారులు బిగ్ షాక్ ను ఇచ్చారు. ఈయన కుమారులపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ, మనో ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 12, 2024 | 10:58 AMUpdated Sep 12, 2024 | 11:00 AM
ప్రముఖ సింగర్ మనో కుమారులపై పోలీసు కేసు నమోదు

సింగర్ ‘మనో’.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రముఖ స్టార్ సింగర్స్ లో మనో కూడా ఒకరు. అయితే ఈయన తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, బెంగాలీ తో పాటు దాదాపు 11 భాషల్లో తన గాత్రంతో 30 వేలకు పైగా పాటలు పాడారు. అలాగే మను సింగర్ మాత్రమే కాదు, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. ముఖ్యంగా ఈయన సుపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదాపు అన్న సినిమాల్లోను డబ్బింగ్ చెప్తుంటారు. ఈ క్రమంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మను. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మనోకి ఆయన కుమారులు బిగ్ షాక్ ను ఇచ్చారు. తాజాగా మను కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రముఖ సింగర్ మనో కుమారులపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.మద్యం మత్తులో ఉన్న మను కుమారులు తన స్నేహితులతో కలిసి ఓ ఇద్దరు యువకులపై దాడికి దిగారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్ధి వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే వారు  మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తండగా.. స్థానికంగా ఉన్న హోటల్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లారు.

ఆ సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతో పాటు మరో ముగ్గురు  స్నేహితులు అక్కడ ఉన్నారు. అయితే ఈ ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్‌తోపాటు మరో16 ఏళ్ల బాలుడితో ఘర్షణకు దిగారు. దీంతో మాట మాట పెరిగి, గొడవ ముదరడంతో.. ఈ ఐదుగురు  ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తీవ్రంగా కృపాకరన్‌ ను స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వళసరవాక్కం పోలీసులకు సింగర్‌ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్‌ పై హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  వీరిలో మను కుమారులను అరెస్టు చేయగా.. మను కుమారులతో పాటు అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. ఇక వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరీ, సింగర్ మనో కుమారులపై కేసు నమోదు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.