iDreamPost
android-app
ios-app

సింగర్ చిన్మయిపై నెటిజన్ వల్గర్ కామెంట్.. ఎంతకావాలో చెప్పమంటూ..!

  • Author Soma Sekhar Published - 03:09 PM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Published - 03:09 PM, Mon - 2 October 23
సింగర్ చిన్మయిపై నెటిజన్ వల్గర్ కామెంట్.. ఎంతకావాలో చెప్పమంటూ..!

సాధారణంగా సోషల్ మీడియాలో ఆకతాయిల వేధింపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ వేధింపులకు కొన్ని కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు సైతం గురవుతూ ఉంటారు. తాజాగా స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఇలాంటి వేధింపులకే గురైంది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలపై తరచుగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ.. ఎంతటివారినైనా ఎదిరిస్తుంది. దీంతో ఆమెపై ఓ వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ చిన్మయిపై సోషల్ మీడియా వేదికగా వల్గర్ కామెంట్స్ చేశాడు. దీంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ స్టార్ సింగర్.

చిన్మయి శ్రీపాద.. టాలీవుడ్ స్టార్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సింగర్ గానే కాకుండా సొసైటీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై సోషల్ మీడియాలో తన గళం వినిపిస్తూ ఉంటుంది. తప్పు చేసింది ఎంతటి వారైనా.. ఓపెన్ గానే విరుచుకుపడుతుంది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ చిన్మయిపై వల్గర్ కామెంట్స్ చేశాడు. కొద్దిరోజుల క్రితం చిన్మయికి ఓ నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. ‘సమాజంలో అమ్మాయిల కోసం నిలబడే మీ తీరు నాకు ఎంతో ఇష్టం. ఎప్పుడూ మీరు ఇలాగే ఉండాలి. మా సోదరి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బంది పడింది’ అని మెసేజ్ చేశాడు.

కాగా.. ఆ మెసేజ్ కు ఆమె నుంచి రిప్లై రాకపోవడంతో.. అతడిలో ఉన్న మరో కోణం బయటకి తీశాడు. ‘నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నాతో కొంత టైమ్ స్పెండ్ చేస్తావా? నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ లైఫ్ ఇస్తాను’ అంటూ మరో అర్ధం వచ్చేలా మరో మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ లపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ చెత్త వెధవ మెుదట పద్దతిగా మెసేజ్ చేశాడు. నేను రిప్లై ఇవ్వకపోవడంతో.. వాడిలోని అసలు రూపం బయటకి వచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చెయ్యాలి. వాడిని కాదు ముందు వాళ్ల నాన్నను అనాలి. పిల్లల్ని ఇంత దరిద్రంగా ఎలా పెంచాడు? వీడిలాంటి వెధవలు సొసైటీలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలు జాగ్రత్త’ అంటూ చిన్మయి తెలిపింది. సదరు చాటింగ్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది చిన్మయి. దీంతో ఆ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet