iDreamPost
android-app
ios-app

సీఎం పై సింగర్ చిన్మయి కామెంట్స్! తనకు ఆ పని నచ్చలేదంటూ పోస్ట్!

  • Author ajaykrishna Published - 09:30 AM, Fri - 14 July 23
  • Author ajaykrishna Published - 09:30 AM, Fri - 14 July 23
సీఎం పై సింగర్ చిన్మయి కామెంట్స్! తనకు ఆ పని నచ్చలేదంటూ పోస్ట్!

సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ లుగా మారుతుంటారు. ఎప్పుడూ ఏదొక విషయంపై లేదా ఇష్యూపై రియాక్ట్ అవుతూ.. తమను తాము వివాదాలలో నిలుపుకుంటారు. ఆఖరికి కాంట్రవర్సీల కారణంగా తిరిగి ట్రోల్స్ కి గురవుతారు. అలాగని ఎలాంటి ఇష్యూస్ అయినా వారు చూస్తూ ఊరుకోలేరు. నిర్భయంగా తమ అభిప్రాయాలను బయట పెట్టేస్తుంటారు. సౌత్ లో అలాంటి డేర్ ఉన్న బ్యూటీ సింగర్ చిన్మయి శ్రీపాద. ఈమె పాపులర్ సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అందరికి సుపరిచితమే. అయితే.. ఇండస్ట్రీలోనైనా, బయట అయినా.. ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా చిన్మయి ఇట్టే నిలదీస్తుంటుంది.

ఆమె డేర్ కి అందరు ఫ్యాన్సే. కానీ.. మీటూ ఉద్యమంలో భాగంగా అప్పట్లో పాటల రచయిత వైరముత్తు పై చిన్మయి చేసిన కామెంట్స్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి వైరముత్తు విషయంలో ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ని సూటిగా ప్రశ్నిస్తూ.. ఓ లెటర్ రాసింది. తాజాగా వైరముత్తు పుట్టినరోజు సందర్బంగా సీఎం స్టాలిన్.. స్వయంగా అతని ఇంటికెళ్లి విష్ చేశారు. దీంతో సీఎం పై ఫైర్ అవుతూ.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇంటికెళ్లి మరి ఎలా విష్ చేస్తారు? అలాంటి వారి వల్ల మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోతారు అని కామెంట్ చేసింది. చిన్మయి తన లెటర్ లో.. మీటూ ఉద్యమంలో వైరముత్తుపై ఆరోపణలు చేసినందుకు 2018 నుండి తమిళ ఇండస్ట్రీ తనపై కక్ష సాధిస్తోందని ఆవేదన బయటపెట్టింది.

ఆమె ఇంకా వివరిస్తూ.. “నేను సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌ గా ఎన్నో అవార్డులు పొందాను. అయినా నన్ను బ్యాన్ చేశారు. గత ఐదేళ్లుగా ఈ నరకం చూస్తున్నా. న్యాయం కోసం కోర్టులో కేసు వేశాను. అసలు వేధించేవాడు కవి ఎలా అవుతాడు. దశాబ్దాల క్రితం జన్మించిన వ్యక్తి ఆదర్శంగా ఉండాలి. కానీ.. లేడీస్ ఎవరి మీదనైనా చేతులు వేసేయాలని ఎలా అనుకుంటాడు? అడ్డు చెప్పేవారి నోరు మూయించడానికి డీఎంకేతో, రాజకీయ నాయకులతో ఉన్న బంధం అతనికి బాగా కలిసొచ్చింది. అదీగాక ఇలాంటివారికీ పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, నేషనల్ అవార్డులు ఎలా ఇచ్చారో అర్ధం కాట్లేదు. అవన్నీ అధికారం అడ్డుపెట్టుకుని చేసినవే. అతనికి ఉన్న అధికార బలం అలాంటిది. అందువల్ల అ ఆ వ్యక్తి వేధింపుల గురించి నోరు తెరవలేకపోయాం. ఇక రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడుతుంటే సిగ్గుగా అనిపిస్తుంది. వైరముత్తు లాంటి వాళ్లు రాజకీయ నాయకుల అండతో ఇంకెన్ని తప్పులు చేస్తారో..’ అని మండిపడుతూ రాసుకొచ్చింది చిన్మయి. మరి చిన్మయి పోస్ట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.