iDreamPost
android-app
ios-app

లావణ్య సంచలన వ్యాఖ్యలు.. అతడి ఫోన్ లో నా ప్రైవేట్ వీడియో ఉంది

  • Published Aug 13, 2024 | 9:14 AM Updated Updated Aug 13, 2024 | 9:14 AM

Lavanya-Mastan Sai Arrest: లావణ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడి ఫోన్ లో ఆమె ప్రైవేటు వీడియో ఉంది అని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

Lavanya-Mastan Sai Arrest: లావణ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడి ఫోన్ లో ఆమె ప్రైవేటు వీడియో ఉంది అని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Aug 13, 2024 | 9:14 AMUpdated Aug 13, 2024 | 9:14 AM
లావణ్య సంచలన వ్యాఖ్యలు.. అతడి ఫోన్ లో నా ప్రైవేట్ వీడియో ఉంది

హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్రుష్టించింది. ఈ వివాదంలోకి మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా చేరింది. లావణ్య.. రాజ్ తరుణ్, మాల్విల మీద సంచలన ఆరోపణలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంది. తాను రాజ్ తరుణ్ ప్రేమించుకున్నామని.. గుడిలో సీక్రెట్ గా వివాహం కూడా చేసుకున్నామని.. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని చెప్పుకొచ్చింది. మాల్వి పరిచయం అయ్యాకే రాజ్ తనకు దూరం అయ్యాడని ఆరోపించింది. కానీ రాజ్ తరుణ్ మాత్రం లావణ్యకు మస్తాన్ అనే వ్యక్తితో సంబంధం ఉందని.. తను డ్రగ్స్ వాడుతుందని ఆరోపించాడు. తమిద్దరి మధ్య బంధం ఎప్పుడో ముగిసిందన్నాడు. ఇలా ఉండగా.. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గత కొంత కాలంగా మీడియాలో నిత్యం వినిపిస్తోన్న వ్యక్తి మస్తాన్ సాయిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు గతంలో వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పైగా ఇతడి మీద లావణ్య అత్యాచారం కేసు కూడా పెట్టింది. ఈ క్రమంలో తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. డ్రగ్స్ సప్లై మాత్రమే కాక.. అతడు పలువురు అమ్మాయిలను ట్రాప్‌ చేసి, వారి వీడియోలను రికార్డ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి మొబైల్లో వందలాది మంది యువతుల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. మస్తాన్ సాయి మొబైల్ లో తన ప్రైవేటు వీడియో కూడా ఉందని చెప్పుకొచ్చింది.

ఏప్రిల్ 2023లో మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు ఆహ్వానించాడు. ఆమె హోటల్‌లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వెళ్లి ఆమెను కొట్టి ఆమె ఫోన్ లాక్కొని అత్యాచారయత్నం చేసినట్లు లావణ్య ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని తాజాగా లావణ్య చెప్పుకొచ్చింది. ఈ వీడియో సంగతి రాజ్ తరుణ్ కి కూడా తెలుసన్నది.