iDreamPost

16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్లకే మరణం.. ఓ స్టార్ హీరోయిన్ విషాద గాథ

అందమైన బొమ్మల వెనుక అంతులేని గాధలెన్నో ఉన్నాయి. తెరపై నవ్వుతూ నవ్విస్తూ.. మనల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఎంతో మంది హీరో హీరోయిన్ల జీవితాలను పరికించి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాధ.

అందమైన బొమ్మల వెనుక అంతులేని గాధలెన్నో ఉన్నాయి. తెరపై నవ్వుతూ నవ్విస్తూ.. మనల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఎంతో మంది హీరో హీరోయిన్ల జీవితాలను పరికించి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాధ.

16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్లకే మరణం.. ఓ స్టార్ హీరోయిన్ విషాద గాథ

సినీ రంగుల ప్రపంచంలో తెరపై ఎంతో మంది హీరో హీరోయిన్లు మనల్ని అలరించారు, అలరిస్తూనే ఉన్నారు. కానీ కొంత మంది అభిమానుల గుండెకు గాయాలు చేసి చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతుంటారు. ఫట్ ఫట్ అన్న ఊతపదంతో 70వ దశకంలో ఓ ఊపు ఊపేసిన ఫటా ఫట్ జయలక్ష్మి.. ప్రేమ విఫలమై.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. తన మత్తైన కళ్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన సిల్క్ స్మిత కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అలాగే సౌందర్య, ప్రత్యూష, ఉదయ్ కిరణ్, ప్రేమ దేశం హీరో కునాల్, ఆర్తి అగర్వాల్, ఉల్లాసం ఉత్సాహం హీరో యశో సాగర్ కూడా చిన్న వయస్సులోనే మృత్యువాత పడ్డారు. 35 ఏళ్లు నిండకుండానే వివిధ కారణాలతో మరణించారు.

కానీ వీరి కన్నా అత్యంత చిన్న వయస్సులోనే మృతి చెందిందో ప్రముఖ నటి. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈమెపై విధి పగబట్టింది.  చిన్న వయస్సులోనే ఆమె ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది. 16 ఏళ్లకే జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. కానీ అనూహ్యంగా 21 ఏళ్ల వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది. అప్పటికే దక్షిణాది ఇండస్ట్రీని చుట్టేసింది. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసింది. తెలుగు, కన్నడలో ఒక్కోటి చొప్పున చేసింది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. మలయాళ బ్యూటీ మోనీషా ఉన్ని. 1971లో కేరళలోని కొజీకోడ్ ‌లో జన్మించిన మోనీషా.. బెంగళూరులో తన విద్యను పూర్తి చేసింది. 1986లో వచ్చిన నఖక్షతంగల్ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డును కొల్లగొట్టడం విశేషం.

వరుస పెట్టి మలయాళ చిత్రాలు చేసింది. పూకల్ విదుమ్ తుడు అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిరంజీవి సుధాకర్ చిత్రంలో శాండిల్ వుడ్ పరిశ్రమలోకి కాలు పెట్టింది మోనీషా. ఇక తెలుగులో కూడా ఒక్కటంటే ఒక్క చిత్రమే చేసింది. అదే శారద ప్రధాన పాత్రలో పోషించిన లాయర్ భారతి దేవి. ఇందులో నందమూరి అందగాడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా.. మోనీషా హీరోయిన్. లీల పాత్రలో కనిపించింది. తమిళంలో, మలయాళంలో ఆమె చేసిన చిత్రాలు వరుసగా హిట్స్ కొట్టడంతో ఈ రెండు పరిశ్రమల్లో వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది. మాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. 21 ఏళ్లకు ఊహించని ప్రమాదంలో మరణించింది. 1992 డిసెంబర్ 5న ఓ సినిమా షూటింగ్ సమయంలో తన తల్లితో కలిసి వెళుతుండగా.. అలప్పుజ వద్ద జరిగిన ప్రమాదంలో మోనీషా మరణించింది. తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పుడు తల్లి శ్రీదేవి ఉన్నీ.. సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి