iDreamPost
android-app
ios-app

Shruti Haasan: అందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jul 29, 2024 | 8:44 PM Updated Updated Jul 29, 2024 | 8:44 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన కెరీర్ కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఆ సినిమాలు చేసినందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదని చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన కెరీర్ కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఆ సినిమాలు చేసినందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదని చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 29, 2024 | 8:44 PMUpdated Jul 29, 2024 | 8:44 PM
Shruti Haasan: అందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో పలానా పాత్రలే చేస్తానని గిరి గీసుకుని కూర్చుంటే పని అవ్వదు. పైగా కెరీర్ ముందుకు సాగకపోగా.. తట్టాబుట్టా సర్ధుకోవాల్సి వస్తుంది. అయితే కొంత హీరోయిన్స్ మాత్రం గ్లామర్ పాత్రలు చేయనని మెుఖం మీదే చెబుతుంటారు. మరికొందరు మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేస్తూ.. అలాంటి పాత్రలకు సై అంటుంటారు. తాజాగా తన ఇంటిని చూపిస్తూ.. ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ సినిమాలు చేసినందుకు ఏ  మాత్రం సిగ్గు పడటం లేదని చెప్పుకొచ్చింది.

ముంబైలో తన ఇంటిని చూపిస్తూ.. తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది శృతిహాసన్. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ..”కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇక సినిమా గురించి ఓ పేపర్ లో వచ్చిన రివ్యూ చూసి ఎంతో బాధపడ్డాను. నా ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటే.. కచ్చితంగా ఇండస్ట్రీ వదిలి పోయేవారే. కానీ నేను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. నా కెరీర్ లో ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించాను. ఇందుకు ఏ మాత్రం నేను సిగ్గుపడటం లేదు. పైగా అవి విజయాలు సాధించాయి కూడా. ఇక నాకెంతో ఇష్టమైన సినిమాలకు చాలా కష్టపడ్డాను, కానీ అవి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు” అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇక తన తల్లి సారికకు తండ్రి కమల్ హాసన్ ఇచ్చిన మెుదటి బహుమతిని చూపించింది. ఇది తనకు స్పెషల్ అని, అందుకే దాన్ని రూమ్ లో దాచుకోకుండా ఫ్రిడ్జ్ పై పెట్టినట్లు చెప్పుకొచ్చింది శృతి. దాన్ని చూసినప్పుడు నాలో స్ఫూర్తి రగులుతుందని పేర్కొంది. ఇక శృతి నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ఆమె చేతిలో ప్రస్తుతం డకాయిట్, సలార్ 2, కూలీ, చెన్నై స్టోరీస్ చిత్రాలు ఉన్నాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş