iDreamPost
android-app
ios-app

Taapsee Pannu: ఆ విషయంలో బాధపడ్డా.. భర్త గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన తాప్సీ!

  • Published Jul 29, 2024 | 6:13 PM Updated Updated Jul 29, 2024 | 6:13 PM

ఆ విషయంలో బాధపడ్డాను అంటూ.. తన భర్త గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ విషయంలో బాధపడ్డాను అంటూ.. తన భర్త గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Taapsee Pannu: ఆ విషయంలో బాధపడ్డా.. భర్త గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన తాప్సీ!

ఇండస్ట్రీలో ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీ, నటులు కొంత మంది ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటుంది తాప్సీ పన్ను. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తాప్సీ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాగే పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలపై కూడా రియాక్ట్ అవుతుంది. తాజాగా తన భర్తకు సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఆ వివరాల్లోకి వెళితే..

తాప్సీ పన్ను.. తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కానీ ప్రస్తుతం తన ఫొకస్ మెుత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక 2024 మార్చిలో తన ప్రియుడు, డెన్మార్క్ మాజీ బ్యాడ్మింట్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ తన భర్త గురించి చాలా మందికి తెలియపోవడం బాధకరమని, అలాంటి వారిని చూస్తే జాలేస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే తన భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాప్సీ మాట్లాడుతూ..”నా భర్త మథియాస్ బో గురించి బయటకి వచ్చి ఎవ్వరికీ చెప్పాలనుకోవడం లేదు. ఇప్పటికీ ఆయన గురించి తెలియని వారిని చూస్తే నాకు బాధగా ఉంది. అతను పెద్ద క్రికెటర్ కాదు.. బిజినెస్ మెన్ అంతకన్నా కాదు. మీకు అతని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేదు అంతే. ఇక ప్రపంచ బ్యాడ్మింటన్ లో అతిపెద్ద విజయాలు సాధించిన వారిలో నా భర్త ఒకరు. అలాంటి ఆయన గురించి ఇంకా చాలా మందికి తెలియకపోవడంతో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఇక మథియాస్ బో ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ మూవీ ఫిర్ ఆయి హసీన్ దిల్ రూబా మూవీ ఆగస్ట్ 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. మరి తాప్సీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişJojobet Giriş