iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ వెంటపడి వేధించిన ఆగంతకుడు.. వైరలవుతోన్న వీడియో

  • Author Soma Sekhar Updated - 02:58 PM, Tue - 19 September 23
  • Author Soma Sekhar Updated - 02:58 PM, Tue - 19 September 23
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ వెంటపడి వేధించిన ఆగంతకుడు.. వైరలవుతోన్న వీడియో

సాధారణంగా సెలబ్రిటీలు సినిమా ఈవెంట్స్ కు వచ్చినప్పుడు లేదా.. ఇతర ప్రాంతాలకు షూటింగ్ కోసం వెళ్తున్నప్పుడు వారికి అభిమానుల నుంచి, కొంతమంది ఆకతాయిల నుంచి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇలాంటి టైమ్ లో సెక్యూరిటీ ఉంటే ప్రాబ్లెమ్ ఉండదు. కానీ సెక్యూరిటీ లేకపోతే.. సదరు సెలబ్రిటీలు తెగ కంగారుపడిపోతుంటారు. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ శృతి హాసన్ ను ఓ ఆగంతకుడు వేధించాడు. తన వెంట ఎందుకు పడుతున్నావ్? అని వాదించినా.. అతడు వినిపించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శృతి హాసన్.. తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ, ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఓ ఆగంతకుడు చేసిన పనికి తెగ కంగారుపడిపోతూ.. కెమెరా కంటికి చిక్కింది. అసలు విషయం ఏంటంటే? షూటింగ్ లో బ బిజీగా ఉంటూ.. ఎప్పుడూ ట్రావెలింగ్ చేస్తుంటుంది శృతి హాసన్. ఈ క్రమంలోనే తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ ఆగంతకుడు తన వెనకపడటంతో.. ఆందోళన చెందింది ఈ అమ్మడు.

అతడిని గమనించిన శృతి, తన వెనక ఎందుకుపడుతున్నావని వారించగా.. అతడు ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెను వేధించసాగాడు. దీంతో అక్కడి నుంచి వేగంగా వెళ్లేందుకు తన కారు వద్దకు వెళ్లింది శృతి. అక్కడి కూడా ఆ వ్యక్తి వచ్చి వేధించసాగాడు. దీంతో నువ్వెవరో నాకు తెలీదు.. నా వెంట ఎందుకు పడుతున్నావ్ అంటూ.. కోప్పడింది శృతి హాసన్. ఇదంతా కెమెరా కంటికి చిక్కడంతో.. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఇంత జరుగుతున్నా అక్కడికి మాత్రం సెక్యూరిటీ రాకపోవడం గమనార్హం. కాగా.. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా మరికొన్ని మూవీస్ లో శృతి నటిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss