iDreamPost
android-app
ios-app

లోకేష్- శృతి ఫుల్ సాంగ్ రిలీజ్.. టీజర్ ని మించి..

  • Published Mar 25, 2024 | 4:33 PM Updated Updated Mar 25, 2024 | 4:33 PM

Lokesh Kanagaraj- Shruti Haasan Song: లోకేశ్ కనకరాజ్- శృతిహాసన్ జంటగా నటించిన ఇనిమెల్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మరి.. ఆ సాంగ్ ఎలా ఉందో చూద్దాం.

Lokesh Kanagaraj- Shruti Haasan Song: లోకేశ్ కనకరాజ్- శృతిహాసన్ జంటగా నటించిన ఇనిమెల్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మరి.. ఆ సాంగ్ ఎలా ఉందో చూద్దాం.

  • Published Mar 25, 2024 | 4:33 PMUpdated Mar 25, 2024 | 4:33 PM
లోకేష్- శృతి ఫుల్ సాంగ్ రిలీజ్.. టీజర్ ని మించి..

లోకేశ్ కనకరాజ్ గురించి పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని స్టోరీ టెల్లింగ్, టేకింగ్ గురించి ఫ్యాన్స్ కి ఒక మంచి అవగాహన, నెక్ట్స్ లెవల్ నమ్మకం ఉన్నాయి. అయితే అతడిని ఒక హీరోగా స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది? అనే థాట్ మాత్రం ఎవరికీ రాలేదు. ఇప్పుడు ఈ ఫుల్ సాంగ్ చూసిన తర్వాత ఆ థాట్ ఎంతో మంది నిర్మాతలకు, డైరెక్టర్స్ కు వస్తుంది కావచ్చు. ఎందుకంటే శృతిహాసన్ పక్కన లోకేశ్ కనకరాజ్ ఎంతో బాగా సెట్ అయ్యాడు. ఒక హీరోకి ఏమాత్రం తగ్గకుండా అతను పలికించిన ఎక్స్ ప్రెషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ సాంగ్ టేకింగ్ కూడా ఎంతో కొత్తగా ఉంది. ఒక సినిమా మొత్తాన్ని ఈ సాంగ్ లో చూపించేశారు అనిపించేలా ఉంది.

శృతి హాసన్- లోకేశ్ కనకరాజ్ కాంబోలో ఇనిమెల్ అనే సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్ ని కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మించారు. సాంగ్ లిరిక్స్ ని కమల్ హాసన్ అందించారు. ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది.. కాన్సెప్ట్ చేసింది శృతిహాసన్. ఈ ఇనిమెల్ పాట విన్న తర్వాత కమల్ హాసన్ పెన్నులో పదును తగ్గలేదు అని ఫిక్స్ అయిపోతారు. అలాగే శృతిహాసన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసింది అనే విషయం అర్థమవుతుంది.

అంతేకాకుండా.. ఈ సాంగ్ కాన్సెప్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక అబ్బాయి అమ్మాయి పరిచయం అయ్యాక మొదటిసారి బయటకు వెళ్తారు. ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తూ సినిమాకి వెళ్తారు. అయితే వారి భవిష్యత్ ని ఆ సినిమాలో ఊహించుకుంటారు. వారి ప్రేమ బలపడంట, వాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరూ కలిసి కాపురం పెట్టడం. ఆ తర్వాత వారి వైవాహిక జీవితంలో గొడవలు రావడం, వాళ్లు డైవర్స్ కి అప్లయ్ చేసి విడిపోవడం వరకు జరుగుతుంది. అది మొత్తాన్ని వాళ్లు స్క్రీన్ మీద చూసుకుని ఆశ్చర్యపోతారు. మనం కూడా ఇలాగే అవుతామా అని ప్రశ్నించుకుంటారు. అయితే అలాంటిది ఏమీ జరగదు అని తమకి తాము నచ్చజెప్పుకుని తమ ప్రేమని కొనసాగిస్తారు.

ఈ కాన్సెప్ట్ కి మొత్తం అభిమానులు, ఆడియన్స్ నుంచి అద్భుతమైన అప్లాజ్ లభిస్తోంది. ఈ ఇనిమెల్ సాంగ్ లో భువన్ గౌడ టేకింగ్ కి మంచి మార్కులు పడుతున్నాయి. అతని ఫ్రేమింగ్, శృతి హాసన్ ఐడియాలజీకి భువన్ ఇచ్చిన ఫ్రేమింగ్ చూస్తే ఒక మ్యాజిక్ చేశాడు అనిపిస్తుంది. మొత్తానికి శృతిహాసన్ మరోసారి మ్యూజిక్ కంపోజర్ గా తన సత్తా చాటింది. అలాగే లోకేశ్ కనకరాజ్ డైరెక్టర్ గానే కాకుండా.. ఒక నటుడిగా కూడా తనలో ఎంతో టాలెంట్ ఉంది అనే విషయాన్ని గట్టిగానే వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారబోతోంది. మరి.. ఈ ఇనిమెల్ సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet