iDreamPost
android-app
ios-app

వీడియో: RC16పై హైప్ పెంచేసిన శివరాజ్ కుమార్.. స్టోరీ ఏంటో చెప్తూ..

  • Published Mar 20, 2024 | 3:05 PM Updated Updated Mar 20, 2024 | 3:05 PM

RC 16- Ram Charan: రామ్ చరణ్- జాన్వీ కపూర్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఆర్సీ16 పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాకి సంబంధించి శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మూవీపై హైప్ పెంచేస్తున్నాయి.

RC 16- Ram Charan: రామ్ చరణ్- జాన్వీ కపూర్- బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఆర్సీ16 పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాకి సంబంధించి శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మూవీపై హైప్ పెంచేస్తున్నాయి.

  • Published Mar 20, 2024 | 3:05 PMUpdated Mar 20, 2024 | 3:05 PM
వీడియో: RC16పై హైప్ పెంచేసిన శివరాజ్ కుమార్.. స్టోరీ ఏంటో చెప్తూ..

ప్రస్తుతం అందరూ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గురించే మాట్లాడుతున్నారు. ఈ మూవీ నుంచి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయి? సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తమన్ ఇటీవల స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ గురించే మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సినిమాపై శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అంచనాలను పెంచేస్తున్నాయి.

ఆర్సీ16 ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోందని చాలానే వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించి ఆవిడ పుట్టినరోజున పోస్టర్ తో అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ జతకట్టనుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిని శివరాజ్ కుమార్ కూడా కన్ఫామ్ చేశాడు. అలా కన్ఫామ్ చేయడమే కాకుండా ఆర్సీ16 ప్రాజెక్ట్ కథ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు ఐడియాలజీ గురించి గొప్పగా మాట్లాటాడు.

Shivaraj kumar

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివన్న ఈ కామెంట్స్ చేశాడు. “బుచ్చిబాబు ఒక కథ కోసం నన్ను కలిశాడు. అతను ఎంతో పొలైట్ గా చేతులు కట్టుకుని సార్ అంటూ ఉన్నాడు. అయ్యో మీరు డైరెక్టర్ మీరు అలా ఉంటారేంటి అని వారించాను. ఫ్రీగా ఉండమని చెప్పాను. అతను ఒక 30 నిమిషాలు కథ చెప్తాను అన్నాడు. ఆ తర్వాత అది గంటన్నర అయ్యింది. అతని ఆలోచనకు నేను షాకైపోయాను. అసలు అలాంటి థాట్ ఎలా వస్తుంది అని మెస్మరైజ్ అయ్యాను. అతని ఆలోచన చాలా గొప్పగా ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ లాంటి గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి ఉండటం కూడా సంతోషం” అంటూ శివరాజ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకి ఈ కథ అంత నచ్చింది కాబట్టి కచ్చితంగా యాక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

భాషతో సంబంధం లేకుండా శివరాజ్ కుమార్ ఈ మధ్య క్యామియోలు, గెస్ట్ అప్పియరెన్సులు బాగానే చేస్తున్నాడు. కాబట్టి ఆర్సీ16లో శివరాజ్ కుమార్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సీనియర్ నటుడు ఒక డైరెక్టర్ గురించి, అతను చెప్పిన కథ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే ఆ కథలో కచ్చితంగా విషయం ఉండే ఉంటుంది. కాబట్టి రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్టు.. బుచ్చిబాబు ఖాతాలో రెండో చిత్రం కూడా సూపర్ హిట్ అయినట్లే అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ సినిమాకి సంబంధించి శివరాజ్ కుమార్ ఇచ్చిన హైప్ కి తెగ హ్యాపీ ఫీలైపోతున్నారు. అలాగే ఇవాళ జరిగిన పూజా కార్యాక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ రామ్ చరణ్– జాన్వీ కపూర్- బుచ్చిబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి.. ఆర్సీ16పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet