iDreamPost
android-app
ios-app

Shekar Movie Review శేఖర్ రిపోర్ట్

  • Published May 20, 2022 | 4:40 PM Updated Updated May 20, 2022 | 4:40 PM
Shekar Movie Review శేఖర్ రిపోర్ట్

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో చిరంజీవి శకంలో మంచి ఫాలోయింగ్ తో బ్లాక్ బస్టర్స్ చేసిన డాక్టర్ రాజశేఖర్ కొంచెం గ్యాప్ తర్వాత చేసిన మూవీ శేఖర్. మలయాళం జోసెఫ్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు జీవిత దర్శకురాలు. గతంలో ఎవడైతే నాకేంటి, శేషు లాంటి చిత్రాలను డీల్ చేసిన అనుభవం ఉండటంతో దీని మీద అంతో ఇంతో అంచనాలు ఏర్పడ్డాయి. నేను చేసిన అప్పులు తీరాలంటే ఇది ఆడాలని మీడియా సుముఖంగా చెప్పిన రాజశేఖర్ ఆశించినట్టు ఇవాళ ఓపెనింగ్స్ చెప్పుకోదగిన స్థాయిలో లేవు. మరి మౌత్ టాక్ మీదే ఆధారపడి థియేటర్లలో అడుగుపెట్టిన ఈ డిఫరెంట్ క్రైమ్ డ్రామా మెప్పించేలా ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

శేఖర్(రాజశేఖర్) రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వృత్తి మానేసినా క్లిష్టమైన కేసుల్లో చిక్కుముడులు విప్పడం కోసం డిపార్ట్ మెంట్ ఇతని సహాయం తీసుకుంటుంది. భార్య ఇందు(ఆత్మీయ రాజన్) విడిపోవడంతో ఆ జ్ఞాపకాలతో ఒంటరి జీవితం గడుపుతూ ఉంటాడు. ఊహించని పరిస్థితుల్లో ఇందు ఓ యాక్సిడెంట్ లో కన్ను మూస్తుంది. ముందు ప్రమాదమని భావించినా తర్వాత అది హత్యని అనుమానం వచ్చిన శేఖర్ తనే స్వయంగా రంగంలో దిగుతాడు. విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. చట్టం ముందు అసలు దుర్మార్గులను బయట పెట్టాలంటే మాములు పద్ధతి సరిపోదని లైఫ్ ని రిస్క్ లో పెట్టేందుకు సిద్ధపడతాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి

రాజశేఖర్ తెల్లని గెడ్డం జుట్టుతో డిఫరెంట్ గా కనిపించారు. సాయికుమార్ డబ్బింగ్ ప్లస్ అయినప్పటికీ వయసు దృష్ట్యా మునుపటి ఎనర్జీ తగ్గడంతో ఒరిజినల్ వెర్షన్ లో హీరో క్యారెక్టర్ లో కనిపించేంత డెప్త్ ఇందులో ఫీలవ్వం. పైగా స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం మరో మైనస్. చాలా నిదానంగా సాగుతుంది. ఆర్టిస్టులు బాగానే కుదిరినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో చివరికి అసంతృప్తి మిగులుతుంది. శివాత్మిక పాత్ర చిన్నదే. బాండింగ్ సన్నివేశాలు పర్వాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం సోసోనే. కథనాన్ని వేగంగా పరిగెత్తించేలా రాసుకుని ఉంటే బాగుండేది. క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది. మొత్తానికి ఈ శేఖర్ యావరేజ్ కంటే కిందే నిలిచిపోయాడు