Sheesh Mahal: ఒకే వారంలో థియేటర్లతో పాటు OTTలో స్ట్రీమింగ్! రాహుల్ రామకృష్ణ స్పెషల్ ఫిల్మ్!

ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘శీష్ మహల్’ మూవీ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఒకే వారంలో అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీని కూడా దున్నేసేందుకు సిద్ధమవుతోంది.

ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘శీష్ మహల్’ మూవీ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఒకే వారంలో అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీని కూడా దున్నేసేందుకు సిద్ధమవుతోంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఎప్పుడూ ఒకే ఇమేజ్​లో ఉండిపోతారనే గ్యారెంటీ లేదు. సాధారణ నటులుగా అడుగుపెట్టిన వారు సూపర్​స్టార్లుగా చక్రం తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే మొదట ఇక్కడ అవకాశం వస్తే చాలని అందరూ అనుకుంటారు. చిన్న రోల్స్ అయినా ఫర్లేదు.. క్లిక్ అయ్యాక భారీ అవకాశాలు వస్తాయని భావిస్తారు. స్మాల్ క్యారెక్టర్స్ చేసుకుంటూ బిగ్​ స్టార్స్ అయిన వారూ ఉన్నారు. అలాగే కమెడియన్స్​, విలన్స్​గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోలుగా మారి రాణించిన వారూ ఉన్నారు. ఈ తరంలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో కమెడియన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనే రాహుల్ రామకృష్ణ. టాలీవుడ్​లో టాప్ కమెడియన్​గా ఉన్న ఆయన.. ‘శీష్ మహల్’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ఒకే వారంలో అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీలోకి రానుంది.

రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘శీష్ మహల్’ ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్​లో రిలీజ్ కానుంది. ఈ ఆంథాలజీ ఫిల్మ్​ను బుధవారం నాడు హైదరాబాద్​లోని ఐమాక్స్​ థియేటర్​లో స్క్రీనింగ్ చేయనున్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ‘శీష్ మహల్’ స్ట్రీమింగ్ అవనుంది. ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్​ను ఈటీవీ విన్ ఓటీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్యాంప్ శశి డైరెక్షన్​లో రూపొందిన ఈ సినిమాను హైదరాబాద్​ బ్యాక్​డ్రాప్​లో తీశారు. నాలుగు కథలతో ఆంథాలజీగా ‘శీష్ మహల్’ తెరకెక్కింది. ఫిల్మ్ ఫెస్టివల్స్​ కోసం మూవీ తీయాలని నిశ్చయించుకున్న కొందరు ఎలాంటి కష్టాలు పడ్డారు? వాళ్లు తమ కలను ఎలా సాకారం చేసుకున్నారనేది రియలిస్టిక్​గా ట్రైలర్​లో చూపించారు. ఈ ట్రైలర్​కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

‘శీష్​ మహల్’ సినిమాకు అయిన బడ్జెట్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. కేవలం రూ.15 లక్షల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసేశారు. 5డీ కెమెరాతో హైదరాబాద్​లోనే ఈ ఫిల్మ్ షూటింగ్​ మొత్తాన్ని కంప్లీట్ చేశారు. షూటింగ్​కు ఏడు లక్షలు, మరో ఎనిమిది లక్షలతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశామని స్వయంగా డైరెక్టర్ తెలిపారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి సూపర్ హిట్స్​కు మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్.. ‘శీష్​ మహల్’కు బాణీలు అందించడం విశేషం. ఈ మూవీలో చాలా మంది కొత్త నటులు యాక్ట్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’కి ముందే రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో నటించారు. అయితే ఇప్పటికి రిలీజ్​కు మోక్షం లభించింది. కెరీర్ స్టార్టింగ్​లో ఆయన నటించిన సినిమా కావడంతో చాలా మంది ఆడియెన్స్ దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ ఆంథాలజీ కావడంతో ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగాయి. మరి.. ‘శీష్​ మహల్​’ను చూసేందుకు మీరెంత ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Movie: ‘ఫైటర్‌’ OTT రిలీజ్‌ డేట్‌.. ఎప్పటినుంచంటే?

Show comments