iDreamPost
android-app
ios-app

‘జవాన్’ రెండో ట్రైలర్ వచ్చేసింది! యాక్షన్ మోడ్ లో షారుఖ్ విశ్వరూపం..!

  • Author ajaykrishna Updated - 03:14 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Updated - 03:14 PM, Thu - 31 August 23
‘జవాన్’ రెండో ట్రైలర్ వచ్చేసింది! యాక్షన్ మోడ్ లో షారుఖ్ విశ్వరూపం..!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ – దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ‘జవాన్’. యాక్షన్ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 7న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. షారుఖ్ నుండి జవాన్ వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో కూడా సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. షారుఖ్ సరసన నయనతార, దీపికా పదుకొనే నటిస్తుండగా.. విజయ్ సేతుపతి విలన్ గా నటించడం విశేషం. కాగా.. ఆల్రెడీ సినిమా నుండి అనిరుధ్ అందించిన సాంగ్స్ ఫుల్ బజ్ క్రియేట్ చేశాయి. మరోవైపు జవాన్ నుండి ట్రైలర్ కూడా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించింది.

ఇలాంటి తరుణంలో.. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో జవాన్ రెండో ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో చూస్తుంటే.. షారుఖ్ మరోసారి ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. హాలీవుడ్ లెవెల్ యాక్షన్, విజువల్స్ తో పాటు సినిమాలో.. దేశభక్తి పాయింట్ ని కూడా టచ్ చేశారు. ఇందులో దీపికా పదుకొనే గెస్ట్ అప్పియరెన్స్.. విలన్ గా విజయ్ సేతుపతి లుక్స్ ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి షారుఖ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అదే మాస్ యాక్షన్ మోడ్ లో ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ అట్లీ. సో.. జవాన్ రెండో ట్రైలర్ కూడా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.

ఇక ఈ ట్రైలర్ లో విజువల్స్ తో పాటు షారుఖ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్.. నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటున్నాయి. నయనతార ఎప్పటిలాగే తన గ్లామర్ తో పాటు సీరియస్ యాక్షన్ తో అదరగొట్టింది. మొత్తంగా జవాన్ ట్రైలర్ సౌత్ మసాలా జోడించి.. బాలీవుడ్ ట్రీట్మెంట్ ని మిస్ అవ్వకుండా చూసుకున్నాడు అట్లీ. కాగా.. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ వైఫ్ గౌరీ ఖాన్ నిర్మించారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ హైప్ క్రియేట్ చేసిన జవాన్ టికెట్స్.. ఓవర్సీస్ లో భారీ రేంజ్ లో అమ్ముడుపోతున్నాయి. అంతేగాక ఆగష్టు 31 రాత్రి 9 గంటలకు జవాన్ ట్రైలర్ ని బూర్జ్ ఖలీఫా పై ప్రదర్శించబోతున్నారు. మరి జవాన్ సెకండ్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkom girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis