iDreamPost
android-app
ios-app

నీ భార్యతో జాగ్రత్తగా ఉండు.. విగ్నేష్‌కు షారుఖ్‌ హెచ్చరిక!

  • Published Jul 13, 2023 | 11:32 AM Updated Updated Jul 13, 2023 | 11:32 AM
  • Published Jul 13, 2023 | 11:32 AMUpdated Jul 13, 2023 | 11:32 AM
నీ భార్యతో జాగ్రత్తగా ఉండు.. విగ్నేష్‌కు షారుఖ్‌ హెచ్చరిక!

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్‌ శివన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. అది కూడా అతడి భార్య నయన తార విషయంలో. షారుఖ్‌ ఏంటి? విగ్నేష్‌కు నయనతార విషయంలో వార్నింగ్‌ ఇవ్వటం ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా ఫన్నీగా జరిగిన చాటింగ్‌ సంభాషణ. ఇంతకీ ఏం జరిగిందంటే.. షారుఖ్‌ ఖాన్‌-నయన తారలు అట్లీ దర్శకత్వంలో ‘జవాన్‌’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకులను ముందుకు రానుంది.

తాజాగా, విడుదలైన జవాన్‌ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక, ఈ ట్రైలర్‌పై నయన తార భర్త విగ్నేష్‌ శివన్‌ స్పందించారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ మేరకు రెండు పోస్టులు పెట్టారు. ఓ పోస్టులో.. ‘‘బాలీవుడ్‌ డెబ్యూట్‌తోనే అదరగొడుతున్న అట్లీని చూసి గర్వపడకుండా ఎలా ఉంటాము. సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఎంతో శ్రమ, ఓపిక, పనితనం ఉంది. హ్యాట్సాఫ్‌ టు అట్లీ’’ అని పేర్కొన్నారు. మరో పోస్టులో.. ‘‘నయనతారకు నా శుభాకాంక్షలు. నా బంగారం షారుఖ్‌తో డ్రీమ్‌ డెబ్యూట్‌ ఇస్తోంది. అనిరుథ్‌, విజయ్‌ సేతుపతితో పాటు మిగిలిన వారికి నా కుదోస్‌’’ అని రాసుకొచ్చాడు.

ఇక, విగ్నేష్‌ పోస్టులపై షారుఖ్‌ ఖాన్‌ స్పందించారు. ‘‘ విగ్నేష్‌ శివన్‌ నీ ప్రేమకు కృతజ్ఞతలు. నయనతార ఓ అద్భుతం. కానీ, నేను ఎవరిని ఇది చెప్పడానికి. నీకు ముందే తెలుసు కదా.. కానీ, విగ్నేష్‌ జాగ్రత్తగా ఉండు.. ఎందుకంటే.. ఇప్పుడు తను కొన్ని కీలకమైన కిక్స్‌, పంచులు నేర్చుకుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. షారుఖ్‌ నయన తార విషయంలో విగ్నేష్‌కు వార్నింగ్‌ ఇవ్వటంపై ఫన్నీగా స్పందిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom