iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: షూటింగ్ లో ప్రమాదం.. గాయపడిన షారుక్ ఖాన్!

బ్రేకింగ్: షూటింగ్ లో ప్రమాదం.. గాయపడిన షారుక్ ఖాన్!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జవాన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మరో ప్రాజెక్టు విషయంలో షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది షారుక్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే షూటింగ్ సమయంలో షారుక్ ఖాన్ గాయపడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించగా.. చిన్న సర్జరీ కూడా చేసినట్లు చెబుతున్నారు.

షారుక్ కాన్ ప్రస్తుతం జవాన్ తర్వాతి ప్రాజెక్టు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతోంది. అయితే ఆ షూటింగ్ లో ప్రమాదవశాత్తు షారుక్ ఖాన్ గాయపడినట్లు ఈటీ టైమ్స్ వెల్లడించింది. ముక్కు నుంచి రక్తం రావడంతో చిత్రబృందం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారంట. షారుక్ ని పరీక్షించిన వైద్యులు రక్తం ఆపేందుకు మైనర్ సర్జరీ కూడా చేసినట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా షూటింగ్ ఆపేసుకుని అమెరికా నుంచి ఇండియాకి వచ్చేశాడని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి షారుక్ కుటుంబ సభ్యులను మీడియా అడిగే ప్రయత్నం చేయగా.. వాళ్లు సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాద్ షా అభిమానులు అంతా జవాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పఠాన్ సూపర్ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మరింత అంచనాలు పెరిగాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom